news

News March 28, 2025

కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

image

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.

News March 28, 2025

‘ఎల్2: ఎంపురాన్’పై విమర్శలు!

image

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ గ్రూప్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు కావాలనే చేసినట్టు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మతపరమైన వాటిలో తప్పుగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ పృథ్వీరాజ్‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News March 28, 2025

చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

image

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.

News March 28, 2025

BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

image

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.

News March 28, 2025

ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

image

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్‌లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.

News March 28, 2025

ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

image

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.

News March 28, 2025

30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

image

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?

News March 28, 2025

బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 28, 2025

మీకు తెలుసా?.. రూ.45కోట్ల బడ్జెట్…రూ. లక్ష దాటని కలెక్షన్స్

image

బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన లేడీ కిల్లర్ చిత్రం రూ.45కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ వంటి స్టార్‌లు నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‌గా నిలిచింది. ఇందులో విషయమేముంది అనుకుంటున్నారా? ఈ మూవీ మెుదటి వారం రూ.1లక్ష కంటే తక్కువే వసూలు చేసిందట. అంతే కాకుండా, కొనుగోలు చేయడానికి OTTలు రాకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మూవీని రిలీజ్ చేశారు.

News March 28, 2025

బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

image

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.