news

News March 28, 2025

ఆయనకు న్యాయపరమైన విధులు వద్దు: సుప్రీంకోర్టు

image

జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు న్యాయపరమైన విధులు అప్పగించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. కాగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.

News March 28, 2025

నాకు రూల్స్ పెడితే నచ్చదు: సమంత

image

సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడమూ విజయంలో భాగమేనని సమంత చెప్పారు. రివార్డులు వస్తే కాదు.. తనకు నచ్చినట్లు బతికితే అదే సక్సెస్ అని పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘ఆడపిల్ల కాబట్టి అది, ఇది చేయకూడదు అని రూల్స్ పెడితే నచ్చదు. నాకు ఇష్టమొచ్చినట్లు జీవించాలనుకుంటా. లైఫ్‌లో, తెరపై అన్ని రకాల పాత్రలను పోషించాలి. అదే నా గెలుపు అనుకుంటా’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

BREAKING: టాస్ గెలిచిన CSK

image

చెన్నై వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, రుతురాజ్, త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, జడేజా, ధోనీ, అశ్విన్, నూర్, మతీశా, ఖలీల్
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్, లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్

News March 28, 2025

డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శుభవార్త

image

TG: గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తిచేసుకునేలా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో బేస్‌మెంట్ పూర్తిచేసిన వారికి తొలి విడత రూ.లక్ష చెల్లించాలని సూచించారు.

News March 28, 2025

సేవింగ్స్ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు యథాతథం

image

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా కొనసాగించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని తెలిపింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లకు, PPFకు 7.1% ఉంటుంది. 115 నెలల కిసాన్ వికాస్ పత్రకు 7.5%, NCSకు 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ ఉంటుంది. 2023-24 చివరి త్రైమాసికం నుంచి ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

News March 28, 2025

విషమంగా అంజలి ఆరోగ్యం.. నిందితుడు అరెస్ట్

image

AP: ఓ వ్యక్తి చేతిలో మోసపోయానంటూ రాజమండ్రిలో <<15894441>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి(23) ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, నేచురల్‌గానే రికవరీ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. సూసైడ్ నోటు ఆధారంగా మాధవరావు దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంజలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

News March 28, 2025

మేకిన్ ఇండియా.. భారీ డీల్

image

మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం భారీ రక్షణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 156 ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్లను (LCH) HAL నుంచి కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఓకే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.09 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులపై రక్షణ శాఖ సంతకాలు చేసింది. రూ.62 వేల కోట్లతో ఈ హెలికాప్టర్లను కర్ణాటకలోని బెంగళూరు, తుమ్‌కూర్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయనుంది.

News March 28, 2025

IPL టికెట్ రూ.2343, పన్నులు రూ.1657!

image

IPL టికెట్ల ద్వారా మన ప్రభుత్వాలు క్రికెట్ అభిమానులను దోచేస్తున్నాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ.2343 ఉండగా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ (25%) రూ.781 వేశారు. ఆ మొత్తంపై మళ్లీ 28 శాతం జీఎస్టీ వడ్డించారు. ఇందులో కేంద్రానికి 14 శాతం, రాష్ట్రానికి 14 శాతం వెళ్తుంది. రూ.4000లలో పన్నుల రూపంలోనే రూ.1657 తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 28, 2025

కొలికపూడి వ్యవహారంపై నివేదిక కోరిన టీడీపీ

image

AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై TDP అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఆయనలో మార్పురాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త, ఎంపీని ఆదేశించింది. తాజాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలికపూడి <<15904325>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.

News March 28, 2025

రూ.వేల కోట్లలో నల్లధనం బయటపడింది: మోదీ

image

2047 సంవత్సరంలో దేశం వికసిత్ భారత్‌గా ఎదిగిన నాడు అధికంగా లాభపడేది యువతేనని ప్రధాని మోదీ తెలిపారు. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే సదస్సులో మోదీ మాట్లాడారు. ED దాడులతో రూ.22,000 కోట్ల నల్లధనం బయటపడిందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సవాళ్లు అధిగమించేందుకు IMAC ఏర్పాటవుతుందని, ఇది ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్‌ను కలుపుతుందన్నారు. విపత్తుల సమయంలో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.