news

News March 28, 2025

తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే?

image

ఇటీవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ <<15869889>>తమీమ్ ఇక్బాల్<<>> కోలుకున్నారు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‘తమీమ్ సాధారణ స్థితికి రావడానికి జీవనశైలిని మార్చుకోవాలి. కఠినమైన డైట్‌ను అనుసరించాలి’ అని డాక్టర్ షాబుద్దీన్ తెలిపారు. అతను గ్రౌండులో దిగడానికి 3 నెలల టైమ్ పడుతుందని హెల్త్ మినిస్టర్ అబు జాఫర్ తాజాగా వెల్లడించారు. స్మోకింగ్‌‌ను మానుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

News March 28, 2025

వారికి ఉగాది, రంజాన్ సెలవులు లేవు

image

AP: ఈ నెల 30, 31న పబ్లిక్ హాలిడేల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 30, 31ని రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించింది. ఆ రెండు రోజులు ఆఫీసులు ఉ.11 నుంచి సా.5.30 గంటల వరకు పని చేస్తాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులిచ్చింది.

News March 28, 2025

45 రోజులు, 4 కేసులు.. సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు: వైసీపీ

image

AP: కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును టీడీపీ లాయర్లకు దోచిపెడుతోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు మిత్రుడు సిద్ధార్థ్ లూథ్రాకు ఫీజు రూపంలో రూ.2.86 కోట్లను చెల్లించిందని మండిపడ్డారు. ఇది కేవలం 2024 జులై 16 నుంచి అక్టోబర్ 1 మధ్య 45 రోజుల్లో 4 కేసులకు చెల్లించిన మొత్తమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News March 28, 2025

RCBతో మ్యాచ్.. CSK స్టార్ ప్లేయర్ దూరం!

image

కాసేపట్లో ఆర్సీబీతో జరిగే కీలకమైన మ్యాచ్‌కు కూడా CSK స్టార్ బౌలర్ మతీషా పతిరణ దూరమయ్యారు. గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించారు. MIతో మ్యాచ్‌లో ఆడిన జట్టును కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేలంలో రూ.13 కోట్లకు పతిరణను CSK సొంతం చేసుకుంది. గాయంతో తొలి మ్యాచ్‌కు అతను దూరమవగా రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ భావించారు.

News March 28, 2025

మిడ్ డే మీల్‌కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

image

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్‌హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 28, 2025

మతం విషయంలో నా తల్లిదండ్రులకు సమస్య రాలేదు: సల్మాన్ ఖాన్

image

తన తల్లిదండ్రుల వివాహంలో హిందూ-ముస్లిం అనే తేడా ఎప్పుడూ రాలేదని సల్మాన్ ఖాన్ అన్నారు. వారికి వృత్తిపరమైన సమస్య తప్ప వేరే ఏది ఉండేది కాదని పేర్కొన్నారు. సికందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్, సుశీల 1964లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సల్మా ఖాన్‌గా సుశీల పేరు మార్చుకున్నారు.

News March 28, 2025

భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

image

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.

News March 28, 2025

కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

image

భూకంప తీవ్రతకు మయన్మార్‌ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.

News March 28, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిన జిల్లా రిజిస్ట్రార్

image

AP: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి చెందిన రమేశ్‌బాబు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఇందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేయడంతో రమేశ్ ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో నిఘా వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

News March 28, 2025

2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

image

గురుగ్రామ్‌ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్‌ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.