India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

ఇతర వ్యాపారుల్లాగే ఆర్సెలార్ స్టీల్ కంపెనీ అధినేత లక్ష్మీమిత్తల్ UKను వదిలేస్తారని సమాచారం. 30 ఏళ్లుగా విదేశీ ఆదాయం, లాభాలపై ఇస్తున్న పన్ను మినహాయింపులను ప్రస్తుత లెఫ్టిస్టు ప్రభుత్వం ఎత్తేయడమే ఇందుకు కారణం. ‘మిత్తల్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఏడాదిలోపు తుది నిర్ణయం తీసుకోవచ్చు’ అని FT పేర్కొంది. పన్నుల వల్ల బ్రిటన్ సంపన్నులు ఎక్కువగా UAE, స్విట్జర్లాండ్, ఇటలీకి వలస వెళ్తున్నారు.

ఇవాళ రాత్రి జరిగే RCBvsCSK హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో రెండు జట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటల్లో చెన్నైకి అనుకూలంగా 52%, బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ SMలో విడుదల చేసింది. ఏది ఏమైనా చివరికి మ్యాచ్‌లో తమదే విజయమని ఇరు టీమ్స్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇవాళ ఎవరు గెలుస్తారు? మీ కామెంట్.

Indian Express నివేదిక ప్రకారం మన దేశంలోని 100 మంది అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమిత్ షా, జైశంకర్, మోహన్ భాగవత్ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 14, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానాల్లో నిలిచారు. ఇక క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 48వ స్థానంలో ఉండగా, విరాట్ 72, బుమ్రా 83వ ప్లేస్‌లలో ఉన్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉగాది కానుక ఇచ్చింది. 2 శాతం డీఏ పెంపునకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారి డీఏ 53 నుంచి 55 శాతానికి చేరింది. ఏడో వేతన సవరణ సంఘం సూచనతో ఈ పెంపు లభించింది.

వరుసగా 2 నెలలు షేర్లను తెగ అమ్మిన FIIs మార్చిలో తొలిసారి నెట్ బయ్యర్లుగా అవతరించారు. NSDL ప్రకారం MAR 26 నాటికి రూ.67 కోట్లతో వారు నెట్ సెల్లర్లుగా ఉన్నారు. నిఫ్టీ రీజిగ్, వాల్యూయేషన్లు మారడం, RBI రెండోసారి వడ్డీరేట్లు తగ్గించేందుకు సిద్ధమవ్వడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో తిరిగి భారత్ బాట పట్టారు. MAR 27కి వారి పెట్టుబడి రూ.11,000 కోట్లు దాటిందని NSE ప్రొవిజినల్ డేటా చెప్తోంది.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్‌లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.

తమ జట్టు ఓపెనర్లపై ఆధారపడదని SRH బ్యాటర్ క్లాసెన్ తెలిపారు. ‘హెడ్, అభిషేక్ మాకు అదిరిపోయే ఆరంభాల్ని ఇస్తున్నారు. అలా అని మేం వారిపైనే ఆధారపడలేదు. మా లైనప్ చూడండి. 8వ నంబర్ బ్యాటర్ వరకూ విధ్వంసకరంగానే ఆడతారు. కాబట్టి ఓపెనర్లు ఎలా ఆడినా సమస్య లేదు. మేం ఆడేదే రిస్కీ ఆట. నిన్నటి మ్యాచ్‌లో ఒకట్రెండు వికెట్లు దురదృష్టవశాత్తూ కోల్పోయాం. లేదంటే ఆ పిచ్‌పై కనీసం 220 స్కోర్ చేయాల్సింది’ అని వివరించారు.

AP: రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, రెండు బీజేపీకి దక్కాయి. ఆ కమిటీల్లో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన పదవులను భర్తీ చేస్తామని కూటమి అగ్ర నేతలు చెబుతున్నారు.

డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రచిస్తున్నారని TVK పార్టీ చీఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని గారూ.. మీరు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అన్నప్పుడే మేం మీ ప్లాన్లను అర్థం చేసుకున్నాం. తమిళనాడును జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈ రాష్ట్రం ఎన్నో సార్లు తన శక్తిని చూపించింది. మీరు జాగ్రత్తగా ఉండండి సర్’ అని సూచించారు.
Sorry, no posts matched your criteria.