news

News March 28, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1050 పెరిగి రూ.83,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1140 పెరగడంతో రూ.90,980 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా రూ.3000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.

News March 28, 2025

WARNING: నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు

image

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటికి వెళ్లొద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలు, విజయనగరం-22, పార్వతీపురం మన్యం-12, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లా-5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

News March 28, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ&రేటింగ్

image

లడ్డూ పెళ్లి క్యాన్సిల్ కావడంతో ముగ్గురు హీరోలు గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేదే ‘మ్యాడ్ స్క్వేర్’. మ్యాడ్‌ కామెడీ హిట్ కావడంతో ఈ మూవీలోనూ డైరెక్టర్ కామెడీపైనే దృష్టిపెట్టాడు. ఫస్టాఫ్‌లో సాగదీత, కొన్నిచోట్ల బలవంతపు కామెడీ ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ అదిరిపోతుంది. నితిన్, శోభన్, రామ్, లడ్డూ కామెడీ టైమింగ్‌‌‌తో ఆకట్టుకున్నారు. స్వాతిరెడ్డి సాంగ్ హైలైట్.
రేటింగ్: 2.75/5

News March 28, 2025

ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు

image

260వ ర్యాంకు- దివి మురళి.. దివీస్ ($ 10B)
600- P పిచ్చిరెడ్డి.. MEIL ($5.8B)
625- PV కృష్ణారెడ్డి.. MEIL ($5.6B)
1122- ప్రతాప్ సి.రెడ్డి.. అపోలో హస్పిటల్స్ ($3.3B)
1122- PV రాంప్రసాదరెడ్డి.. అరబిందో ఫార్మా ($3.3B)
1198- B పార్థసారథిరెడ్డి.. హెటిరో ల్యాబ్స్ ($3.1B)
1624- K సతీశ్ రెడ్డి.. డాక్టర్ రెడ్డీస్ ($2.3B)
1796- M సత్యనారాయణరెడ్డి.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ($2.1B)

News March 28, 2025

రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: UP పోలీసులు

image

యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్‌పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

IPL: ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయ్!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 18 ఏళ్లు పూర్తవుతోంది. అయితే, ఈ టోర్నీలో కొన్ని టీమ్స్ మెరుపులా వచ్చి అభిమానుల ప్రేమను సొంతం చేసుకొని పలు కారణాలతో రద్దయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్, పుణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు కొన్ని సీజన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో ఏ టీమ్‌కు మీరు సపోర్ట్ చేసేవారు? COMMENT

News March 28, 2025

భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

image

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

News March 28, 2025

నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.

News March 28, 2025

ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి: పుతిన్

image

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్‌స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.

News March 28, 2025

ఇండియా రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే

image

1వ ర్యాంకు- ముకేశ్ అంబానీ (రూ.8.6 లక్షల కోట్లు)
2వ ర్యాంకు- గౌతమ్ అదానీ (రూ.8.4L కోట్లు)
3వ ర్యాంకు- రోష్ని నాడార్ (రూ. 3.5L కోట్లు)
4వ ర్యాంకు- దిలీప్ సంఘ్వీ (రూ.2.5L కోట్లు)
5వ ర్యాంకు- అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2.2L కోట్లు)
6వ ర్యాంకు- కుమార మంగళంబిర్లా (రూ.2L కోట్లు)
6వ ర్యాంకు- సైరస్ పూనావాలా (రూ.2L కోట్లు)
8వ ర్యాంకు- నీరజ్ బజాజ్ (రూ.1.6 లక్షల కోట్లు)