India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.

రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు UAE ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. మరోవైపు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఇది ఇండియా-UAE మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో సంతృప్తిగా లేనట్లు ‘జీనియస్ కన్సల్టెంట్స్’ సర్వేలో తేలింది. పని వేళల వల్ల రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నామని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. పనికి తగ్గ వేతనాలు కంపెనీ చెల్లించట్లేదని 68% మంది భావిస్తున్నారు. మెంటల్ హెల్త్, శ్రేయస్సు గురించి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే సంతోషపడతామని 89% మంది చెప్పారు.

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

ఇవాళ నాలుగు కొత్త మూవీలు OTTల్లో రిలీజయ్యాయి. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘మజాకా’ సినిమా నేటి నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కిన ‘దేవ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. తమిళ నటుడు జీవా నటించిన ‘అగత్యా’ సన్ నెక్ట్స్‌లో విడుదలైంది.

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ‘మతపరమైన అంశాల్లో ముస్లింల పాత్ర లేకుండా చేసేందుకు, వక్ఫ్ బోర్డును సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకొస్తోంది. ఒక్క ముస్లిం MP, మంత్రి లేని ఈ ప్రభుత్వాన్ని మేం ఎలా నమ్మగలం? ముస్లింలకు టికెట్లు కూడా ఇవ్వరు. పైగా బుల్డోజర్లతో ఇళ్లు కూలగొడుతుంటారు’ అని విమర్శించారు.

TG: రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోటలో సాయికుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతురును ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియన్స్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సినిమాల్ని <<15910211>>దక్షిణ రాష్ట్రాల వాళ్లు చూడట్లేదని<<>> సల్మాన్ వాపోయిన సంగతి తెలిసిందే. మేం చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, 3 ఇడియట్స్, ధూమ్, ధూమ్ 2, బజరంగీ భాయ్‌జాన్ వంటి అనేక సినిమాలు హిట్ అయ్యాయా అంటూ పలువురు సినీ ప్రేమికులు నెట్టింట సల్మాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

జూన్ 6 నుంచి 12వరకు ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC తెలిపింది. ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అటు రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలు ముగిసినట్లు వెల్లడించింది. ఇందులో NTR హెల్త్ వర్సిటీ లైబ్రేరియన్, PCB అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎనలిస్ట్ గ్రేడ్-2, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది.

USతో ఇన్నేళ్లుగా తమకున్న ఆర్థిక, సైనిక, భద్రతాపరమైన బంధం ఇక ముగిసిపోయిందని కెనడా PM మార్క్ కార్నీ ప్రకటించారు. ‘ట్రంప్ విధించిన సుంకాలు అన్యాయమైనవి. అలా విధించడం మా మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే. ఇరు దేశాల బంధాన్ని ట్రంప్ పూర్తిగా మార్చేశారు. ఇక వెనక్కి వెళ్లేది, తగ్గేది లేదు. ఆ దేశానికి తగిన సమాధానాన్ని ఇవ్వనున్నాం. మా ఆత్మగౌరవం, భద్రత మాకు ముఖ్యం’ అని తేల్చిచెప్పారు.
Sorry, no posts matched your criteria.