news

News March 28, 2025

చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

image

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.

News March 28, 2025

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

image

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.

News March 28, 2025

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

image

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News March 28, 2025

జస్టిస్ వర్మపై FIR నమోదు చేయాలని డిమాండ్

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15855499>>యశ్వంత్ వర్మపై<<>> FIR నమోదు చేయాలని మాథ్యూ నెడుంపారా అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అనవసరమని మాథ్యూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

News March 28, 2025

సౌత్ ఆడియన్స్ మా సినిమాలను చూడరు: సల్మాన్ ఖాన్

image

భారీ బడ్జెట్ సినిమాలను తీయడం చాలా కూడుకున్నదని, దానికి బలమైన స్క్రిప్ట్ ఉండాలని సల్మాన్ ఖాన్ అన్నారు. ‘సికందర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘సౌత్ సినిమాలను హిందీ ఆడియన్స్ చూస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను చూడరు. నేను ఎంతో మంది సౌత్ డైరెక్టర్లు, టెక్నీషియన్లతో పనిచేశాను. కానీ నా సినిమాలు దక్షిణాదిలో అంతగా ఆడటం లేదు’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

image

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్‌ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.

News March 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 28, 2025

మార్చి 28: చరిత్రలో ఈరోజు

image

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం

News March 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 28, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.41 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.