news

News March 27, 2025

శాసనసభ నిరవధిక వాయిదా

image

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. 11 రోజుల్లో 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగింది. 12 బిల్లులను ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది.

News March 27, 2025

ప్రైవేట్ వీడియో లీక్.. నటి ఇన్‌స్టా పోస్ట్ చూశారా?

image

తమిళ <<15899290>>నటి ప్రైవేట్ వీడియో<<>> అంటూ SMలో జరుగుతున్న ప్రచారంపై శృతి నారాయణన్ ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. చూడటానికి ఒకేలా ఉన్న ఓ అమ్మాయి AI వీడియోను షేర్ చేశారు. ఇందులో ఎవరు నిజమైన మనిషో చెప్పాలని అందులోని యువతి ప్రశ్నిస్తోంది. AIతో ఇలా చేయొచ్చని శృతి పరోక్షంగా తెలిపారు. దీంతో ఆ నటిపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అయ్యుండొచ్చని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News March 27, 2025

ఏడాదిలో 3 సార్లు CA ఫైనల్ పరీక్షలు: ICAI

image

CA విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) గుడ్ న్యూస్ చెప్పింది. 2025 నుంచి CA ఫైనల్ పరీక్షలు ఏడాదికి 3 సార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబరు‌లో ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం ఏడాదికి 2 సార్లు ఈ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ICAI ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి 3 సార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

News March 27, 2025

సీబీఐలో సంస్కరణలకు పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలు

image

CBIలో సంస్కరణలు అవసరమని పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేసేలా చట్టం తీసుకురావాలంది. UPSC, SSCలాగా స్వతంత్ర రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించింది. డిప్యుటేషన్‌పై ఆధారపడకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ అవసరమని బ్రిజ్‌లాల్ ప్యానెల్ తెలిపింది. సమయానుకూల, పక్షపాతం లేని దర్యాప్తులకు ఈ మార్పులు అవసరమని పేర్కొంది.

News March 27, 2025

లార్డ్ శార్దుల్: అన్‌సోల్డ్ టు 6 వికెట్లు

image

ఐపీఎల్ మెగా వేలంలో శార్దుల్ ఠాకూర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. LSG ప్లేయర్ గాయపడటంతో అనూహ్యంగా రూ.2 కోట్లకే శార్దుల్ జట్టులోకి వచ్చారు. ఆడిన రెండు మ్యాచుల్లో 6 ఓవర్లు బౌలింగ్ వేసి 6 వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నారు. ఇవాళ SRHతో మ్యాచులో 4 కీలక వికెట్లు తీశారు. దీంతో లార్డ్‌ను తక్కువగా అంచనా వేయొద్దని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News March 27, 2025

క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా?

image

IPL సీజన్ ప్రారంభం కావడంతో చాలామంది రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఫాలో అవుతుంటారు. మ్యాచ్ గెలిస్తే వ్యక్తిగత విజయంగా, ఓడితే వైఫల్యంగా భావించడంతో మెదడులో ఆనందం, ఒత్తిడి హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మ్యాచ్ జరిగేటప్పుడు 60% మంది ఘర్షణలకు దిగడం లేదా నిరాశను అనుభవిస్తున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. గెలుపు, ఓటములు తాత్కాలికమని గుర్తిస్తే ఇవేమీ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

News March 27, 2025

మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్

image

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైరయ్యారు. ఆ రాష్ట్రం నుంచే రోహింగ్యాలు, బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఆ రాష్ట్ర సరిహద్దులో 450km మేర ఫెన్సింగ్ పని పెండింగ్‌లో ఉందని, దాని ఏర్పాటుకు మమతా ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. మరోవైపు, వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News March 27, 2025

తెలంగాణలో BYD ప్లాంట్.. రూ.85 వేల కోట్ల పెట్టుబడులు!

image

చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 10 బిలియన్ డాలర్లతో (రూ.85వేల కోట్లు) హైదరాబాద్‌లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. 500 ఎకరాల్లో దీన్ని నెలకొల్పబోతున్నారని, 2032 నాటికి 6 లక్షల కార్ల ఉత్పత్తే లక్ష్యమని సమాచారం. త్వరలో ఈ ప్లాంట్ ఏర్పాటు పనులు పట్టాలెక్కనున్నాయని తెలుస్తోంది.

News March 27, 2025

ప్రతి వారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తా: పవన్

image

AP: ప్రతి వారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని, వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 PSల పరిధిలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ నివేదిక తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీసు అధికారుల మూలంగా పోలీసు శాఖ చులకన అవుతోందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు.

News March 27, 2025

సజ్జల, భార్గవ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్

image

AP: వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట దక్కింది. వారికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.