news

News March 27, 2025

ఎంఈ, ఎంటెక్ ఫలితాలు విడుదల

image

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు OU కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ.శశికాంత్ తెలిపారు. ఫలితాల కోసం osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు. అలాగే, JNTUH ఆధ్వర్యంలో FEB 2025లో జరిగిన బీటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

News March 27, 2025

రోజుకు 15-16 గంటల పని.. మృతి!

image

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-CEO <<15877835>>హన్<<>> జాంగ్ ఝీ (63) అధిక పని భారం వల్లే గుండెపోటుకు గురై మరణించారని తెలుస్తోంది. రోజుకు 15-16 గంటలు పని చేసే ఆయన అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అధిక ల్యాప్‌టాప్, ఫోన్ స్క్రీన్ టైమ్ ద్వారా 2023లోనే న్యూరో సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో మైగ్రేన్ రావడంతో పాటు చేతులు, మెడనొప్పితో బాధపడ్డారు. ఈ ఏడాది ఆరంభం నుంచి హన్ పరిస్థితి క్షీణించింది.

News March 27, 2025

SRH ఎంత కొట్టినా గెలుస్తాం: పంత్

image

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచుకు ముందు LSG కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెంజ్ బాయ్స్ ఎన్ని పరుగులు కొట్టినా తాము ఛేజ్ చేస్తామని చెప్పారు. మ్యాచ్ ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా తొలి మ్యాచులో ఓటమి పాలైన లక్నోకు గెలుపు అవసరం. మరోవైపు సన్ రైజర్స్ భారీ స్కోరుపై కన్నేసింది.

News March 27, 2025

ఏటీఎం విత్‌డ్రాలతో SBIకి భారీ సంపాదన

image

డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతున్న ఏటీఎంలలో నగదు విత్‌డ్రాలతో ఎస్బీఐ భారీగా ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.331 కోట్లు వచ్చాయని అదే సమయంలో ఇతర బ్యాంకులు రూ.925 కోట్ల నష్టాన్ని చూసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు స్వల్పంగా లాభాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 65వేలకు పైగా ఏటీఎంలను SBI నిర్వహిస్తోంది.

News March 27, 2025

IVFలో కొత్త మోసం.. కోర్టుకెక్కిన తల్లిదండ్రులు

image

ఓ జంటకు IVF సెంటర్ షాక్ ఇచ్చింది. వారికి IVF ద్వారా 2019లో పాప పుట్టగా ఓ శస్త్రచికిత్స అవసరమైంది. DNA టెస్ట్ చేయగా వీరి స్పెర్మ్, అండం ద్వారా పాప జన్మించలేదని తేలింది. నేరుగా పిండాన్నే గర్భంలోకి ప్రవేశపెట్టారని తెలిసి వారు IVF సెంటర్‌ను సంప్రదించారు. వారు తల్లి వివరాలే ఇచ్చారు. కాగా, ఆమె ఎముక మజ్జ సాయంతో శస్త్ర చికిత్స చేయగా 2023లో పాప చనిపోయింది. ప్రస్తుతం వారు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు.

News March 27, 2025

SRHకు బిగ్ షాక్

image

IPL-2025: లక్నోతో మ్యాచులో SRHకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఔటయ్యారు. శార్దుల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్లో వరుస బంతుల్లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం స్కోర్ 2.2 ఓవర్లలో 15/2గా ఉంది. హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు.

News March 27, 2025

బట్టతల వల్ల పెళ్లి కావట్లేదని డాక్టర్ సూసైడ్

image

TG: బట్టతల కారణంగా పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ MBBS వైద్యుడు HYDలో సూసైడ్ చేసుకున్నారు. అల్వాల్ బస్తీ దవాఖానాలో పురోహిత్ కిశోర్(34) వైద్యుడిగా పని చేస్తున్నారు. ఇటీవల అతనికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కిశోర్‌కు బట్టతల ఉండటం, ఇతరత్రా కారణాలతో పెళ్లి రద్దైంది. వయసు మీరినా వివాహం కావట్లేదని బొల్లారం రైల్వే‌స్టేషన్ సమీపంలో రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నారు.

News March 27, 2025

చైనా, US కంటే మనమే టాప్

image

గత పదేళ్లలో భారత జీడీపీ రెట్టింపు అయిందని IMF వెల్లడించింది. 2015లో జీడీపీ 2,103 బిలియన్ డాలర్లు కాగా, 2025లో అది 4,271 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు (అంటే 103.1%) తెలిపింది. ఈ పెరిగిన శాతం చైనా (75.8%), అమెరికా (65.8%), కెనడా (49.7%) కంటే ఎక్కువ కావడం విశేషం. 2028 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మూడో స్థానానికి చేరుకోనుందని IMF అంచనా వేసిందని కేంద్రమంత్రి రిజిజు ఆర్టికల్ షేర్ చేశారు.

News March 27, 2025

ఏప్రిల్ 1: మారేవి ఇవే

image

ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
* రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు
* టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు
* SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డుల్లో సవరణలు
* ఇన్‌యాక్టివ్ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లకు నిలిచిపోనున్న యూపీఐ సేవలు

News March 27, 2025

ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు

image

TG: సీఎం రేవంత్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.