India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52కోట్లు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్‌ను తీర్చిదిద్దుతాం. నిధులు విడుదల చేసిన కేంద్ర మంత్రి షెకావత్‌కు ధన్యవాదాలు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు’ అని మంత్రి వివరించారు.

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, విశ్వక్ సేన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమా స్టోరీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయోపిక్‌లా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. ప్రొడ్యూసర్ కూతురితో యంగ్ డైరెక్టర్ ప్రేమాయణం కథాంశమని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందనేది ఫన్నీగా ఉంటుందని తెలిపారు. ఈ స్టోరీ హీరోయిన్ డామినేటెడ్‌గా ఉంటుందన్నారు. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్, షేఖా షేఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మఖ్తూమ్ దంపతులు తమ నాలుగో బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టడం చర్చకు దారితీసింది. ఆ పదానికి అర్థం ‘సమృద్ధి’ అని తెలిసింది. శిశువుకు అమ్మమ్మ ‘షేఖా హింద్ బింట్ మఖ్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్’ పేరునే పెట్టడం విశేషం. ‘దేవుడి ఆశీర్వాదంతో మాకు పుట్టిన నాలుగో బిడ్డకు హింద్‌గా నామకరణం చేశాం’ అని ప్రిన్స్ తెలిపారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్‌లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.

అత్యధిక అక్షరాస్యులున్న కేరళను డ్రగ్స్ భూతం వేధిస్తోంది. దాన్ని అంతం చేయడంలో GOVT విఫలమవుతోంది. తాజాగా పంజాబ్‌ను దాటేసి దేశంలోనే No.1 డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా మారింది. 2021లో 5,696గా ఉన్న NDPS కేసులు 2024లో 27,701కి చేరుకున్నాయి. పంజాబ్ (9,025)తో పోలిస్తే ఇవి 3 రెట్లు ఎక్కువ. 2021కి ముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇవి 87,101కు చేరాయి. ఏకంగా 130% పెరిగాయి.

లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ‘L2:ఎంపురాన్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో PKR వారసుడిగా సీఎం పదవి చేపట్టిన జితిన్ చేసే అవినీతిని హీరో ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ. మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ మెప్పించారు. సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ బాగున్నాయి. బలహీనమైన స్టోరీ, ఎమోషన్ సీన్లు లేకపోవడం, నిడివి, స్లోగా ఉండటం మైనస్.
WAY2NEWS RATING: 2.5/5.
Sorry, no posts matched your criteria.