news

News March 27, 2025

DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

image

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.

News March 27, 2025

ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

image

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News March 27, 2025

జనాభా ఒక్కటే ప్రామాణికం కాదు: సీఎం రేవంత్

image

TG: నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని CM రేవంత్ అన్నారు. డీలిమిటేషన్‌పై CM అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ‘డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా నియంత్రణ ఆ రాష్ట్రాలకు శాపంగా మారకూడదు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారు’ అని గుర్తు చేశారు.

News March 27, 2025

అందరం అవయవదానం చేద్దాం.. సభలో కేటీఆర్ ప్రతిపాదన

image

TG: ఆర్గాన్ డొనేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. సభ్యులంతా అవయవదానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సభ నుంచే ప్రజలకు మంచి సందేశం పంపాలని ఆయన అన్నారు.

News March 27, 2025

అమిత్‌షాపై ప్రివిలేజ్ నోటీసు తిరస్కరించిన RS ఛైర్మన్

image

HM అమిత్ షా‌పై కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సోనియా గాంధీపై ఆయన విమర్శల్లో తప్పేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంటుగా సోనియా గాంధీ విపత్తు నిధి డబ్బులను వాడుకున్నారు. PMNRF కమిటీలో PM, కాంగ్రెస్ Prez ఉండేలా అప్పటి PM నెహ్రూ ప్రకటించారు’ అని 1948 నాటి ప్రెస్ రిలీజును షా కోట్ చేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించానని ధన్‌ఖడ్ తెలిపారు.

News March 27, 2025

ఘోరం.. నలుగురు పిల్లల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య

image

యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి భార్య కంతీదేవితో గొడవపడి, కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషభ్) గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ భార్య చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలంతా 13 నుంచి 5 ఏళ్ల లోపు వారే. రాజీవ్ మెంటల్ హెల్త్ సరిగా లేదని పోలీసులు తెలిపారు.

News March 27, 2025

శరీరంపై ఎక్కువ బ్యాక్టీరియాలు ఉండేది ఇక్కడే..

image

జననాంగాల్లో బ్యాక్టీరియా ఎక్కువని అంతా అనుకుంటాం. కానీ వాటికంటే అధికంగా క్రిములుండే భాగాలున్నాయి. నోటిలోని పళ్లు, నాలుక తదితర భాగాలతో పాటు నాభి/బొడ్డు, చంకలూ వేల బ్యాక్టీరియాలకు ఆవాసాలు. అటు గాలితో పాటు ముక్కులోకి వేల సంఖ్యలో ఇవి చేరుతాయి. ముక్కు రంధ్రాల్లో వేలు పెడితే వేళ్లకూ అంటుతాయి. ఇక గోర్లలో (ముఖ్యంగా చేతుల) వేల కొద్దీ బ్యాక్టీరియాలుంటాయి. వీలైనంత శుభ్రంగా ఉండటమే వీటిని పారదోలే మార్గం.

News March 27, 2025

డైలీ ట్రాన్జాక్షన్లకు UPI, భారీ ఖర్చులకు క్రెడిట్‌కార్డు

image

డైలీ ట్రాన్జాక్షన్ల కోసం UPIను అత్యధికంగా వినియోగిస్తున్న యువత భారీ కొనుగోళ్లకు మాత్రం క్రెడిట్ కార్డును వాడేందుకే ఇష్టపడుతోందని కివీ, అనోమర్ సర్వే తెలిపింది. నెల రోజులు వడ్డీలేని సులభ రుణం దొరకడం, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు అలాగే ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈజీ యాక్సెస్, భారీ రీచ్ వల్ల 70% యువ కస్టమర్లు రోజువారీ ఖర్చులకు, 81% మంది వ్యక్తిగత లావాదేవీలకు UPIని వాడుతున్నారని పేర్కొంది.

News March 27, 2025

పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.

News March 27, 2025

ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.