news

News March 27, 2025

హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

News March 27, 2025

సంపాదనలో రష్మిక మందన్న టాప్

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.

News March 27, 2025

రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు

image

దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 45 శాతానికి పడిపోయినట్లు CWC నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే 25 శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 బీసీఎంలు ఉండగా ప్రస్తుతం 8,070 బీసీఎంలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో ఈ నీటి నిల్వలు మరింతగా అడుగంటనున్నాయి.

News March 27, 2025

పెరిగిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.

News March 27, 2025

రామ్ చరణ్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

image

రామ్ చరణ్‌కు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పెద్ది పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటున్ని కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుందని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ Xలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ NTRతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ తెలిపారు.

News March 27, 2025

2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

image

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

News March 27, 2025

బైక్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. నేరుగా A/Cకి డబ్బులు!

image

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీల ఆధిపత్యానికి ఇక గండి పడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారు నేరుగా లబ్ధి పొందేలా త్వరలో ‘సహకార ట్యాక్సీ’ యాప్‌ను తీసుకొస్తామని లోక్‌సభలో సహకార మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్‌వీలర్స్‌ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి.

News March 27, 2025

కునాల్‌కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

image

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్‌ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్‌నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.

News March 27, 2025

హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

image

AP: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కార్‌కు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.

News March 27, 2025

శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

image

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.