news

News March 27, 2025

సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!

image

భారత్‌కు చెందిన 22 శాతం మంది అతి సంపన్నులు విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు కోటక్ ప్రైవేట్-ఈవై సర్వేలో తేలింది. ఎక్కువగా US, UK, UAE, కెనడా, ఆస్ట్రేలియాలో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. రూ.300 కోట్లకుపైగా ఆస్థి కలిగిన వారు క్వాలిటీ లైఫ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల అక్కడ స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. పిల్లల స్టడీ కోసం కూడా ఆయా దేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్నారు.

News March 27, 2025

సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

image

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.

News March 27, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.

News March 27, 2025

శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

image

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

News March 27, 2025

జియో, ఎయిర్‌టెల్, Vi సిమ్‌లు వాడుతున్నారా?

image

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం త్వరలో ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ సదుపాయాన్ని తీసుకురానున్నాయి. ఇది ఆయా యూజర్లకు కాల్ చేసిన అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు TRAI దీనిని గతంలోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు Jio, Airtel, Vodafone-Idea(Vi) సిద్ధమయ్యాయి. KYC డాక్యుమెంట్ ఆధారంగా ఈ పేర్లను చూపించనున్నాయి.

News March 27, 2025

IPL బ్రాండ్ వాల్యూ రూ.లక్ష కోట్లు

image

ఇండియాలో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన IPL బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. 2009లో దాదాపు రూ.17 వేల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ లీగ్ 2023లో తొలిసారి $10 బిలియన్లను తాకగా.. ఇప్పుడు $12 బిలియన్లకు చేరుకుంది. 2024లో 10 జట్ల సమష్టి బ్రాండ్ విలువ 13% పెరగడంతో ప్రస్తుతం $12 బిలియన్లకు చేరుకుందని TOI తెలిపింది. ఇందులో మీడియా రైట్సే రూ.48వేల కోట్లు కావడం గమనార్హం.

News March 27, 2025

మోహన్‌లాల్ ‘L2 ఎంపురాన్’ పబ్లిక్ టాక్

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రీమియర్ షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు సీక్వెల్‌పై ఇచ్చే సర్‌ప్రైజ్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్, ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News March 27, 2025

చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు

image

TG: చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. దీంతో విద్యార్థినుల సర్టిఫికెట్స్‌పై అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. అంతే కాకుండా వర్సిటీలో PhD చేయాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమమైంది. అధికారులు సైతం త్వరలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ గుర్తింపు లేకపోవడంతో ఇంతకాలం ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్టిఫికెట్స్ వచ్చేవి.

News March 27, 2025

ఈ వీకెండ్ ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

నేటి నుంచి ఈనెల 30 వరకు పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇవాళ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ థియేటర్లలో సందడి చేయనుంది. రేపు ‘మ్యాడ్ స్క్వేర్‌’తో పాటు నితిన్-శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్'(హిందీ) కూడా విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

News March 27, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.