India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని చెప్పడంతో నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ‘దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణనలోకి తీసుకొని వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుంది. ఆ తర్వాత కొత్తవి తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదు. దీంతో అన్నదాతలు అటూ ఇటూ కాకుండా పోయారు’ అని విచారం వ్యక్తం చేశారు.

ఈసారి ‘ఉగాది’ పండుగ ఆదివారం(ఈనెల 30న) రావడంతో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. వారికి ఊరటనిచ్చే విషయం ఏమిటంటే సోమవారం కూడా సెలవు ఉండనుంది. ఎందుకంటే ఆరోజు రంజాన్. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు హాలిడే ఇవ్వనున్నారు. దీంతో ఆది, సోమవారాల్లో సెలవులను ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు?

బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను యాడ్ చేసుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈమేరకు నిన్న బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్‌లోనే దీనికి లోక్‌సభలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. అటు ఓ వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే మొత్తం నగదును ఈ బిల్లు ద్వారా రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు కేంద్రం పెంచింది.

భారత్‌ను చైనా, మెక్సికో, కెనడాతో కలిపి చూడబోమని US వాణిజ్య అధికారులు స్పష్టం చేశారు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా విషయాలకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. INDతో కేవలం టారిఫ్ సమస్యలే ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా INDతో సహా ఇతర దేశాలకు పరస్పర సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

AP: అన్ని నియోజకవర్గాల్లో ప్రతి 3, 6 నెలలకోసారైనా జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను CM చంద్రబాబు ఆదేశించారు. స్కిల్ సెన్సస్ ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రతి జోన్‌కు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలన్నారు. WFH విధానంలో వర్క్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు.

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ప్యానళ్ల పనులను, ఎగువ కాఫర్ డ్యామ్‌ను ఆనుకుని సీపేజీ నివారణకు సాగుతున్న బట్రెస్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

HYD రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇవాళ రా.7.30కి SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో భీకర ఫామ్‌లో ఉన్న SRH హిట్టర్లు మరోసారి రికార్డు బ్రేకింగ్ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. LSG బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా కనిపిస్తుండడంతో గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం తప్పదేమో. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 4 మ్యాచుల్లో తలపడగా LSG 3, SRH 1 గెలిచింది. నేడు SRH 300 కొడుతుందా? COMMENT

TG: రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్ ఉల్ హసన్ అఫెంఢీ, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మండలిలో వీరికి నేడు సన్మానం కార్యక్రమం జరగనుంది.
Sorry, no posts matched your criteria.