news

News March 27, 2025

5 వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

image

AP: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 ప్రభుత్వ వైద్య శాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. వాటిలో రంగరాయ మెడికల్ కాలేజీ, రాయచోటి, చీరాల, పాలకొండ, భీమవరం ఏరియా ఆస్పత్రులున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.23.75 కోట్ల చొప్పున మొత్తం రూ.118.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల్లో 50 బెడ్స్‌తో ఐసీయూ విభాగాలు ఏర్పాటవుతాయి.

News March 27, 2025

విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

image

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

News March 27, 2025

నెలన్నరలో 325 మంది మావోలు హతం: ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం

image

ఛత్తీస్‌గఢ్‌‌లో నెలన్నరలో 325 మంది మావోయిస్టులు హతమైనట్లు ఆ రాష్ట్ర CM విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. మరో 2 వేల మంది అరెస్టు లేదా లొంగిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మావోయిస్టుల ప్రభావం ఉందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. బస్తర్ ప్రాంతం మినహా ఎక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా వారి జాడ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు CM తెలిపారు.

News March 27, 2025

రాష్ట్రంలో మరోసారి టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్?

image

TG: కామారెడ్డిలో పదో తరగతి <<15867946>>ప్రశ్నాపత్రం<<>> లీక్ కలకలం రేపింది. జుక్కల్ జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి గణితం క్వశ్చన్ పేపర్‌లో పలు ప్రశ్నలు లీకైనట్లు తెలుస్తోంది. నీళ్లు సరఫరా చేసే వ్యక్తి ప్రశ్నలు రాసుకొచ్చి విద్యార్థికి జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రశ్నల లీక్ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

News March 26, 2025

YS జగన్ పెద్దమ్మ మృతి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ(85) ఇవాళ పులివెందులలో కన్నుమూశారు. ఈమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.

News March 26, 2025

‘రాబిన్‌హుడ్‌’కి వార్నర్ రెమ్యునరేషన్ ఎంతంటే?

image

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే, అతని పాత్ర స్క్రీన్ మీద 2 నిమిషాల 50 సెకన్లు ఉంటుందని సమాచారం. ఇందుకోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఆయన రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వార్నర్ తెలుగులో మాట్లాడి, డాన్స్ చేసి సందడి చేసిన విషయం తెలిసిందే.

News March 26, 2025

బెడ్‌రూమ్‌లో ఏ కలర్ లైట్ మంచిది?

image

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్‌రూమ్‌లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.

News March 26, 2025

ఇఫ్తార్ విందుకు ఈసీ నో

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించదలచిన ఇఫ్తార్ విందుకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొంటారని పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాయగా ఈసీ తిరస్కరించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

News March 26, 2025

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీలో కీలక పదవి

image

AP: శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News March 26, 2025

IPLలో సరికొత్త చరిత్ర

image

IPL 2025 సరికొత్త జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.