news

News March 26, 2025

రేపటి నుంచి జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్

image

TG: HYD గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు నాలుగో జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ జరగనుంది. సీనియర్, అండర్ 21, పారా కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభిస్తారు. 29న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తారు.

News March 26, 2025

IPL-2025: KKR టార్గెట్ ఎంతంటే?

image

గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌లో KKRపై RR 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ 30+ పరుగులు చేయకపోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా కదిలింది. హసరంగా(4)ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం వర్కౌట్ అవ్వలేదు. జురెల్ 33 పరుగులతో రాణించారు. చివర్లో ఆర్చర్ 2 సిక్సులతో మెరిశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 152 పరుగులు.

News March 26, 2025

మా జోలికి వస్తే ఎవరినైనా వదలబోం: నాటో

image

పోలాండ్ సహా అన్ని సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని అనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్న వేళ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News March 26, 2025

త్వరలోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

image

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

News March 26, 2025

ఉగాది వేడుకలకు రూ.5 కోట్లు విడుదల

image

AP: ఉగాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్ చేసింది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. దీని కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించింది.

News March 26, 2025

వాట్సాప్, గూగుల్ మ్యాప్స్‌తో దొంగడబ్బు కనిపెట్టిన Income Tax

image

ఎగవేతదారులు, బినామీలు, దాచిన డబ్బు, క్రిప్టో అసెట్స్‌ను గుర్తించడానికి Income Tax సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టా, గూగుల్ మ్యాప్స్‌ను విశ్లేషించి వాటిని కనిపెట్టేస్తోంది. ఎగవేసిన ₹200CRను WA ‌ఎన్‌క్రిప్టెడ్ మెసేజుల ఆధారంగా గుర్తించిన వైనాన్ని పార్లమెంటులో FM నిర్మల వివరించారు. G Maps ద్వారా డబ్బు దాచిన చోటు, Insta ద్వారా బినామీ ప్రాపర్టీ ఓనర్‌షిప్‌ను కనిపెట్టామని తెలిపారు.

News March 26, 2025

మధ్యాహ్నం బయటకు రాకండి.. ప్రభుత్వం సూచన

image

TGలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణాలు చేసే సమయాల్లో నీరు, ORS వెంట ఉంచుకోవాలని, దాహం లేకున్నా నీటిని తాగాలని సూచించింది. వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, కళ్లజోడు, క్యాప్ పెట్టుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలంది. మ.12-3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.

News March 26, 2025

IPL: ఢిల్లీకి గుడ్ న్యూస్!

image

భార్య అతియా శెట్టి డెలివరీ కారణంగా IPLలో తొలి మ్యాచుకు దూరమైన ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్ రెండో మ్యాచుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం వైజాగ్‌లో SRHతో జరిగే మ్యాచులో ఆయన ఆడతారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలం చేకూరనుంది. అంతకుముందు లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో ఢిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News March 26, 2025

ఉపాధి హామీ కూలీలుగా షమీ సోదరి, బావ: జాతీయ మీడియాలో కథనాలు

image

భారత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సోదరి, బావ.. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదైనట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2021 నుంచి 2024 వరకు ఆ మేరకు వేతనాలు కూడా తీసుకున్నట్లు తెలిపాయి. అయితే ఈ ఆరోపణలపై షమీ కుటుంబం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇటీవల CT ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీ తల్లి, సోదరి భారత క్రికెట్ జట్టుతో మైదానంలో కనిపించిన విషయం తెలిసిందే.

News March 26, 2025

ప్రముఖ నటి, మోడల్, డాన్సర్ హఠాన్మరణం

image

హాలీవుడ్ నటి, డాన్సర్, మోడల్ సిండ్యానా శాంటాంజెలో (58) మృతిచెందారు. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. రీసెంటుగా ఆమె కాస్మొటిక్ ఇంజెక్షన్లు తీసుకున్నారు. వాటి దుష్ఫలితాల వల్లే బహుశా చనిపోయి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ఒకేసారి మూడు MTV టాప్10 మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నిలిచిన రికార్డు ఇప్పటికీ ఆమెదే కావడం విశేషం.