news

News March 26, 2025

9 రోజుల్లోనే రూ.26.85 కోట్ల విరాళం

image

AP: టీటీడీ ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 9 రోజుల్లోనే రూ.26.85 కోట్ల విరాళం వచ్చింది. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.4.88 కోట్లు, విద్యాదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లను దాతలు అందించారు.

News March 26, 2025

అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన

image

TG: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. <<15893801>>ఫిరాయింపులపై సీఎం రేవంత్<<>> వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు సభ్యుల నిరసనను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సీఎం లేవనెత్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌‌ను స్పీకర్ పాటించట్లేదని సభ నుంచి వాకౌట్ చేశారు.

News March 26, 2025

అనుమతి లేకుండానే భవన నిర్మాణం?

image

TG: భద్రాచలంలో ఆరంతస్తుల <<15893602>>భవనం కుప్పకూలిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత భవనంపైనే మరో ఐదంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రస్టు పేరిట విరాళాలు సేకరించి ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. నిర్మాణం చేపట్టవద్దని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని అంటున్నారు. శిథిలాలను యంత్రాలను(పొక్లెయిన్లు) ఉపయోగించి తొలగిస్తున్నారు.

News March 26, 2025

9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9.
www.indianrailways.gov.in

News March 26, 2025

శ్రేయస్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కాలంలో అయ్యర్ తన ఆటను అద్భుతంగా మెరుగుపర్చుకున్నాడన్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని ఇష్యూస్ తర్వాత ఆటను ఇంప్రూవ్ చేసుకున్న తీరు గొప్పగా ఉందని పేర్కొన్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో అయ్యర్ 97* పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

News March 26, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.

News March 26, 2025

కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

image

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.

News March 26, 2025

కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

image

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

News March 26, 2025

Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్‌ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.

News March 26, 2025

చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

image

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.