India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు (2019 DECలో, 2021 NOVలో, 2024 JULYలో) టారిఫ్‌లను పెంచాయి.

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్ డేటాబేస్ (ఆధార్)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్‌లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్‌ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.

కొందరు మధ్యాహ్న భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. కానీ ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కువగా సలాడ్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్, పెరుగు తినాలి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లు తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. లంచ్‌లో గుడ్లు, చేపలు తినడం ఉత్తమం.

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ఉన్న సభ్యుడికి IPL తుది జట్టులో చోటు కల్పించరా అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్ నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని రిప్లై ఇచ్చారు. GT-PBKS మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు 243పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా GT స్వల్ప తేడాతో ఓడిపోయింది.

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, రెసిస్టెన్సీ స్థాయి వద్ద అమ్మకాల సెగతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్లో నిఫ్టీ 23,604 (-65), సెన్సెక్స్ 77,696 (-320) వద్ద చలిస్తున్నాయి. మీడియా, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు, ఫైనాన్స్, చమురు, ఐటీ, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, BEL, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. TECH M, NTPC, యాక్సిస్, సిప్లా టాప్ లూజర్స్.

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.