news

News March 26, 2025

జాగ్రత్త.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. !

image

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా నీరసం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, రాత్రంతా పలుమార్లు మూత్రవిసర్జనకోసం లేవాల్సి రావడం, నాలుక-పెదాలు మాట్లాడలేనంతగా తడారిపోవడం, టైమ్‌కి తినకపోతే శరీరం వణుకు రావడం.. ఇవన్నీ షుగర్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 26, 2025

భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

image

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్‌లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్‌కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.

News March 26, 2025

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి

image

TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News March 26, 2025

BREAKING: మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్

image

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.

News March 26, 2025

చరణ్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్‌ కానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గ్లింప్స్ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయని, రెహమాన్ సాలిడ్ స్కోర్‌ని అందించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

News March 26, 2025

రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

image

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.

News March 26, 2025

IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

image

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్‌లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.

News March 26, 2025

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు ఇవే

image

☛ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
☛ కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
☛ రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☛ మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
☛ అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
☛ <>ఆన్‌లైన్‌లో<<>> మాత్రమే దరఖాస్తులు

News March 26, 2025

TG: ‘రాజీవ్ యువ వికాసం’.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే

image

☞ రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☞ ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
☞ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, అగ్రికల్చర్ యూనిట్‌కి అప్లై చేస్తే పట్టాదారు పాస్ బుక్, దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికెట్ జతచేయాలి
☞ ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తయ్యాక దానిని డౌన్‌లోడ్ చేసి MPDO లేదా మున్సిపల్/జోనల్ కమిషనర్‌కు సమర్పించాలి

News March 26, 2025

‘కోర్ట్’: USలోనూ అదిరిపోయే కలెక్షన్లు

image

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.50+ కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ దూసుకెళ్తోంది. అమెరికా గడ్డపై $1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. కంటెట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. OTT రిలీజ్‌కు కాస్త టైమ్ పట్టొచ్చని సినీవర్గాలు తెలిపాయి.