India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చేసిన మిగతా స్కామ్స్ అన్నీ చాలా చిన్నవి. మన ఊరు-మన బడి కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. 4823 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

TG: SLBC టన్నెల్ ప్రమాదానికి మల్లెలతీర్థం జలపాతమే కారణమని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆ జలపాతం నీరే ఊటనీరుగా మారి సొరంగం పైకప్పును కూల్చేసినట్లు గుర్తించారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగు ముంచేసినట్లుగానే ఈ ప్రాజెక్టును మల్లెలతీర్థం ముంచేసింది. టన్నెల్‌లోకి నిమిషానికి 3 వేల లీటర్ల ఊట రావడానికి కారణం ఇదే. ఇక్కడికి వచ్చే సీఫేజీ శ్రీశైలం రిజర్వాయర్‌ది కాదని వాటర్‌ఫాల్ నుంచి వస్తోందని నిర్ధారించారు.

ఈరోజు ‘వరల్డ్ పర్పుల్ డే’. దీన్ని మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు. మూర్ఛ గురించి అవగాహన పెంచడానికి, ఆ వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలు& భయాలను తొలగించడానికి ప్రతి ఏటా మార్చి 26న ఈ డేని నిర్వహిస్తారు. WHO ప్రకారం 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీని బారిన పడిన కెనడాకు చెందిన కాసెడీ మేగాన్ 2008లో ‘పర్పుల్ డే’ను తీసుకొచ్చారు.

IPLలో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచులోనే 90+ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచారు. 2018లో DC తరఫున KKRపై 93, నిన్నటి మ్యాచులో GTపై 97 రన్స్ చేశారు. అతను సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్‌ను షాట్స్ ఆడమని చెప్పడం వల్ల చివరి ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఆ పరుగులే మ్యాచ్ చివర్లో కీలకంగా మారాయి. ఫలితంగా 11 రన్స్ తేడాతో PBKS విన్ అయింది.

AP: నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు CM చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

IPL-2025లో ఇప్పటివరకు 5 మ్యాచులు పూర్తవగా, ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 5 జట్లు (SRH, RCB, PBKS, CSK, DC) విజయం సాధించగా, మిగతా 5 జట్లు (LSG, MI, GT, KKR, RR) ఓటమిని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH తొలి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా RCB, PBKS, CSK, DC, LSG, MI, GT, KKR, RR ఉన్నాయి.

TG: రేషన్‌కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

TG: BRS హయాంలో తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు కొందరు BJP నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని BJP MLA రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడూ కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలుంటాయన్న KTR కామెంట్స్‌పై స్పందించారు. అప్పట్లో KTR ఆదేశాలతో రేవంత్‌ను బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని ఇప్పుడాయన CM అయినా వారిని ఏం చేయలేకపోతున్నట్లు చెప్పారు.

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.