India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.

పోక్సో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘వక్షోజాలు పట్టుకోవడం, పైజామా నాడా తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మహిళా సమాజంతో పాటు న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఈ తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన సుప్రీం.. ఇవాళ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

మలయాళ సినిమా ‘రైఫిల్ క్లబ్’ షూటింగ్ సమయంలో తన అనుభవాలను నటి సురభి లక్ష్మి పంచుకున్నారు. ఈ సినిమాలో కీలకమైన ముద్దు సన్నివేశంలో నటించే ముందు సహా నటుడు సజీవ్ కుమార్‌ను బ్రష్ చేసుకొని రమ్మన్నానని తెలిపారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండటమే దానికి కారణమన్నారు. తానూ యాలకులు తిన్నట్లు పేర్కొన్నారు. ఈ సన్నివేశాన్ని సాధారణ సీన్ లాగే చిత్రీకరించాలని కోరినట్లు చెప్పారు. రొమాంటిక్ సీన్స్ నటనలో భాగమేనన్నారు.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణ గాజాలోని, ఖాన్ యూనిస్‌లో పునరావాస కేంద్రాలపై జరిగిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి హమాస్ విజ్ఞప్తి చేసింది.

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

గిగ్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రయోజనాలను అందించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని లేబర్ మినిస్ట్రీ సెక్రటరీ సుమిత తెలిపారు. ‘గిగ్ వర్కర్స్‌కు ఆరోగ్య బీమా అందించాలి. ఆయుష్మాన్ స్కీమ్ కింద వారికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది’ అని వెల్లడించారు. దీంతో ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వర్కర్స్‌కు రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది.

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడం, డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది FEB వరకు 7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలను, 2.08L IMEIలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.4,386 కోట్లను కాపాడినట్లు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు https://cybercrime.gov.in పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.