news

News March 25, 2025

BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News March 25, 2025

శ్రేయస్ తన సెంచరీ కోసం చూడొద్దని చెప్పారు: శశాంక్

image

GTతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97*) సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో ఎండ్‌లో శశాంక్ హిట్టింగ్ చేయడంతో అయ్యర్‌కు స్ట్రైక్ రాలేదు. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ పొగుడుతున్నారు.

News March 25, 2025

ఆ హీరోయిన్‌ మృతితో హీరోకు సంబంధం లేదు: మాజీ ప్రియుడు

image

దక్షిణ కొరియా నటి <<15483613>>కిమ్ సె రాన్<<>> మృతికి నటుడు కిమ్ సూ హ్యూన్, మరో యూట్యూబర్ కారణం కాదని ఆమె మాజీ ప్రియుడు స్పష్టం చేశారు. నిజానికి తనను పట్టించుకోని కుటుంబం వల్లే ఆమె ఎంతో వేదన చెందారని తెలిపారు. న్యూయార్క్‌లో ఆమె రహస్యంగా ఒకరిని పెళ్లిచేసుకొని లైంగిక బంధం కొనసాగించారని వెల్లడించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని కుటుంబం ఇప్పుడొచ్చి వేరొకరిని నిందిస్తుండటం బాధాకరమని విమర్శించారు.

News March 25, 2025

సౌలభ్యాన్ని బట్టి త్వరలోనే బకాయిల విడుదల: సీఎం

image

AP: గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లలో జమ చేస్తామని కలెక్టర్ల సదస్సులో హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి చొర‌వ తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

News March 25, 2025

ప్చ్.. శ్రేయస్ సెంచరీ మిస్

image

గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్సుతో చెలరేగారు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి 42 బంతుల్లోనే 97* పరుగులు చేశారు. అవకాశమున్నా సెంచరీ చేసుకోలేకపోయారు. దీంతో ఐపీఎల్‌లో తొలి సెంచరీ మిస్ చేసుకున్నారు. తన ఇన్నింగ్సుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లు బాదారు.

News March 25, 2025

శ్రేయస్ ఖాతాలో అరుదైన ఘనత

image

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కారు. మరోవైపు IPLలో 2వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో కెప్టెన్‌గా ఉన్నారు.

News March 25, 2025

టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. 9 మందిపై కేసు

image

AP: కడప(D) వల్లూరులో నిన్న మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ వెల్లడించారు. వాటర్ బాయ్‌‌ సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్‌కి వాట్సాప్ చేసినట్లు ఆయన వివరించిన విషయం తెలిసిందే.

News March 25, 2025

IPL: మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

image

ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు(19) సున్నాకే వెనుదిరిగిన ప్లేయర్‌గా ఆయన నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(18), దినేశ్ కార్తీక్(18), పియూశ్ చావ్లా(16), సునీల్ నరైన్(16) ఉన్నారు.

News March 25, 2025

ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఎప్పటినుంచంటే?

image

పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని మే నెలాఖరు లేదా జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. అయితే విత్‌డ్రా లిమిట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 25, 2025

IPL-2025: పాపం.. మ్యాక్స్‌వెల్

image

GTతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరారు. సాయికిశోర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తగులుతున్నట్లు కనిపించడంతో అంపైర్ LBW ఇవ్వగా మ్యాక్సీ రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత రీప్లే చూస్తే బాల్ స్టంప్స్‌ను మిస్ అయినట్లు కనిపించింది. దీంతో మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకొని ఉండాల్సిందని.. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయినా చెబితే బాగుండేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.