news

News March 25, 2025

ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…

image

వారం రోజులుగా చాలామంది శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ఒళ్లంతా జ్వరం పట్టినట్టే ఉంటోందని వాపోతున్నారు. వాతావరణం మారడం, ఎండలు పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెప్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు. మీకూ ఇలాగే ఉంటోందా?

News March 25, 2025

మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

image

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తిహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ అధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది.

News March 25, 2025

ప్రియుడి కోసం.. పెళ్లైన 2 వారాలకే భర్తను చంపించిన భార్య

image

భర్తలను భార్యలు చంపేస్తున్న/చంపిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మీరట్ కేసు మరువక ముందే UP, మైన్‌పురి జిల్లాలో మరో ఘోరం జరిగింది. బలవంతపు పెళ్లి, ప్రియుడిపై ఇష్టంతో పెళ్లైన 2 వారాలకే భర్త దిలీప్ యాదవ్‌ను కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించింది ప్రగతీ యాదవ్. తన భర్త వద్ద బాగా ఆస్తి ఉందని, చంపేశాక సుఖంగా బతకొచ్చని ప్రియుడికి చెప్పింది. దిలీప్ శవం దొరికాక పోలీసుల దర్యాప్తుతో ప్రగతి ప్లాన్ బయటకొచ్చింది.

News March 25, 2025

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

image

మోహన్ లాల్ ‘లూసిఫర్’‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News March 25, 2025

మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

image

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.

News March 25, 2025

హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

image

TG: హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.

News March 25, 2025

50వేల మంది విద్యార్థులకు ‘సిస్కో’ శిక్షణ: లోకేశ్

image

AP: ఉన్నత, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు IT సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుంది. ఈ MoUతో 50K మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

News March 25, 2025

వేసవిలో చెమట వాసన వేధిస్తోందా?

image

వేసవిలో శరీరం నీటిని ఎక్కువగా కోల్పోయి చెమట విపరీతంగా వస్తుంది. దీంతో చెడు వాసన వచ్చి అసౌకర్యానికి గురిచేస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో నిమ్మకాయ రసం, పెరుగు తప్పనిసరి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సాయపడతాయంటున్నారు. రోజ్ వాటర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుందని సూచిస్తున్నారు.

News March 25, 2025

ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

image

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.

News March 25, 2025

టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

image

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.