news

News February 28, 2025

దివ్యాంగుడితో కోహ్లీ సెల్ఫీ.. పిక్ వైరల్

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దివ్యాంగుడితో ఆయన సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని మెచ్చుకుంటున్నారు. కాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో విరాట్ అద్భుత సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

News February 28, 2025

కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

image

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారు.

News February 28, 2025

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పెయింటింగ్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లడ్డూల బఫర్ స్టాక్, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.

News February 28, 2025

కంగారూలపై ప్రతీకారం తీర్చుకుంటారా?

image

2023 వన్డే WCలో అఫ్గానిస్థాన్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది. మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటంతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ రెండు జట్లు నేడు CTలో మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ENGను ఓడించి జోరు మీద ఉన్న అఫ్గాన్.. ఆస్ట్రేలియన్లకు షాక్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి సీనియర్ బౌలర్లు లేకపోయినా AUSను తక్కువ అంచనా వేయలేం.

News February 28, 2025

పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే బంద్

image

TG: ప్రీ వెడ్డింగ్ షూట్, చెవులు పగిలేలా డీజే డాన్సులు పెళ్లిళ్లలో కామన్ అయిపోయాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఉట్నూర్ మం. శ్యాం నాయక్ తండా వాసులందరూ సమావేశమై.. ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే, హల్దీ వంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నామన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్?

News February 28, 2025

రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

image

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్‌లు ఉన్నాయి.

News February 28, 2025

మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా విశాఖలోని గీతం వర్సిటీలో MAR 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఇందులో IT, ITES రంగానికి చెందిన 49 కంపెనీల్లో యువతీయువకులకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2024, 2025లో(Tech, Arts, Science, ITI, Polytechnics & Diploma) ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

News February 28, 2025

నేడు రాయలసీమకు వర్షసూచన

image

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2-3డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.

News February 28, 2025

విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

TG: విద్యాసంస్థల్లోని 15% కన్వీనర్ కోటా సీట్లన్నీ ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. నాన్-లోకల్ కోటాకు సర్కార్ సవరణలు చేసింది. ఇప్పటి నుంచి 85% తెలంగాణ వారికి, 15% తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి అవకాశం కల్పించనుంది. AP విద్యార్థులు పోటీ పడటానికి వీలుండదు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా తదితర కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

News February 28, 2025

SLBC TUNNEL: సర్కార్ కీలక నిర్ణయం

image

TG: SLBC టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట) నుంచి 14వ కి.మీ వద్ద యాడిట్ (టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను NRSCకి అప్పగించింది. టన్నెల్‌లో చిక్కుకున్నవారు కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలుపెడతారు.