news

News February 27, 2025

బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

image

బీఆర్ఎస్ సరైన సమాయానికి SLBC టన్నెల్ పూర్తి చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందితే స్పందించని నేతలు.. నేడు పొలిటికల్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టన్నెల్ విషయాలపై పూర్తిగా అవగాహన 10కి పైగా ఏజెన్సీలు కలిసి ఈ రెస్క్యూ చేపడుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని మంత్రి తెలిపారు.

News February 27, 2025

విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

image

AP: విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ జరగనుంది. ఏపీ ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నాస్కామ్ దీనిని నిర్వహిస్తోంది. 49 ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000+ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024, 2025 పాస్‌అవుట్ అయిన వారు అర్హులు. మార్చి 3లోగా మీ జీమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 27, 2025

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్?

image

కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. వాటా పంపకాలపై సలహాలిచ్చే ఫైనాన్స్ కమిషన్‌కు ఇప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం 41గా ఉన్న వాటాను కనీసం 40%కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అరవింద్ పణగడియా నాయకత్వంలోని కమిషన్ FY2026-27 రికమెండేషన్స్ రిపోర్టును OCT 31లోపు కేంద్రానికి ఇస్తుంది. ఒక శాతం తగ్గినా కేంద్రానికి రూ.35K CR మిగులుతాయి.

News February 27, 2025

PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 27, 2025

పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

News February 27, 2025

ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

News February 27, 2025

షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

image

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.

News February 27, 2025

Perplexity AIతో పేటీఎం జట్టు

image

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్‌ ఆప్షన్ అందించేందుకు Perplexity‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.

News February 27, 2025

సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.

News February 27, 2025

కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

image

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.