India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో హెల్త్‌కేర్ కాస్ట్ ఏటా 14% పెరుగుతోందని ACKO హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. ఈ సెక్టార్లో డబుల్ డిజిట్ ఇన్‌ఫ్లేషన్ ఉండటమే కారణమంది. హాస్పిటల్ ఛార్జీల్లో 23% అప్పు చేసి, 63% సేవింగ్స్ డబ్బుతో చెల్లిస్తున్నారని వెల్లడించింది. దీంతో ఫ్యామిలీపై విపరీతమైన భారం పడుతోందని తెలిపింది. ఇలాంటి ఊహించని సంక్షోభాల్లో చిక్కుకోకుండా మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమని సూచించింది.
కర్ణాటకలో గతంలో చూడని పాలిటిక్స్ కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి, JDU నేత కుమార స్వామి అన్నారు. ‘కాంగ్రెస్ పవర్‌ను దుర్వినియోగం చేస్తోంది. మా స్టేట్ పోలీస్ శాఖ కొత్తగా పనిచేస్తోంది. CM, మంత్రులు కేంద్రం, కేంద్ర సంస్థలపై దాడి చేస్తున్నారు. CM నన్ను, నిర్మలను రిజైన్ చేయమంటున్నారు. ఆమెపై FIRకు ఆదేశించారు. ఎన్నికల బాండ్ల డబ్బులేమైనా ఆమె పర్సనల్ అకౌంట్లోకెళ్లాయా? ఆమెందుకు రిజైన్ చేయాల’ని ప్రశ్నించారు.
AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారంటూ వైసీపీ చీఫ్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా కొరిటిపాడులోని కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు అంబటి, విడదల రజిని, ఎమ్మెల్సీ ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల పూజలు నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 88 పరుగులకే ఆలౌటైంది. ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ 3 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశారు. దీంతో లంకకు 514 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్సులో 602 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్సులో సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తోన్న యాలకుల నమూనాలను టెస్ట్ చేయించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించారు. ప్రతిరోజూ సగటున 80,000 యాలకులను పవిత్ర నైవేద్యంగా పంపిణీ చేస్తారని రామాలయం ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా తెలిపారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి TG సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. చిన్నవయసులోనే ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ అని ట్వీట్ చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారన్నారు. మరోవైపు యువతలో చైతన్యం నింపి జాతీయోద్యమానికి ఉత్తేజితుల్ని చేసిన దేశభక్తుడు భగత్ సింగ్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ‘పవన్ dy.cm అయింది దీక్షలు చేయడానికేనా? లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. అవసరమైతే దీనిపై CM, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు. పవన్‌కు ఏంటి సంబంధం? భార్య క్రిస్టియన్ అని చెప్పిన ఆయన తిరుమల వెళ్లొచ్చా? దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరిపై విమర్శలు సరికాదు’ అని హితవు పలికారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా తొలి రోజు కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. నిన్న ఒక్కరోజే సినిమాకు రూ.172 కోట్లు వచ్చినట్లు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. కాగా, ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా రిలీజైన రోజు రూ.191 కోట్లు రాబట్టింది.
TG: ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న కూకట్‌పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ఇవాళ్టి కూల్చివేతల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అటు మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.
TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులోనే ఉందని చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు తామే వస్తామన్నారు. బీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు ఏడుస్తుంటే రేవంత్ రాక్షసానందం పొందుతున్నట్లు అనిపిస్తోందన్నారు.
Sorry, no posts matched your criteria.