India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన ‘హైడ్రా’ బాధితులతో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి భేటీ అయ్యారు. వారి కోసం ప్రభుత్వంతో పోరాడతామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ‘హైడ్రా హైడ్రోజన్ బాంబ్‌లా తయారైంది. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూల్చేస్తే ఎలా? బుచ్చమ్మది <<14213685>>ఆత్మహత్య<<>> కాదు.. ప్రభుత్వ హత్యే. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటోంది’ అని మండిపడ్డారు.
AP భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘2047 నాటికి $2.4 ట్రిలియన్ GSDP, $43,000 కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 వైపు ప్రయాణం ప్రారంభించినందున మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం పౌరుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నాం. కలిసి APని నిర్మించుకుందాం’ అని CM పిలుపునిచ్చారు. మీ ఆలోచనను పంచుకునేందుకు ఇక్కడ <
RGకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు CBI కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, నిజమేనని తేలితే మరణదండనకు దారితీస్తాయని తెలిపింది. నిందితుడిని బెయిల్‌పై రిలీజ్ చేయడం అన్యాయమే అవుతుందంది. టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్ బెయిల్‌నూ తిరస్కరించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాల ట్యాంపరింగ్, FIR లేట్ కేసులో వీరు అరెస్టయ్యారు.
AP: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన సిట్ ఇవాళ తిరుమలలో పర్యటించనుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం కానుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు.
AP: దశాబ్దాలుగా దివిసీమ ప్రజలు ఎదురుచూస్తున్న మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై ముందడుగు పడింది. ఈ లైన్ ఆవశ్యకతపై ఎంపీ బాలశౌరి వివరణతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే 113KM ప్రయాణించాలి. కొత్త లైన్ పూర్తైతే దూరం తగ్గి చెన్నై, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేందుకు సులువు అవడంతో పాటు సరకు రవాణా చేసుకోవచ్చు.
యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్‌కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఇరానీ కప్ కోసం తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఇరానీ కప్‌తో పాటు రంజీ ట్రోఫీలోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అతడు ఆడే ముంబై జట్టుకు ఇది గట్టి దెబ్బే. ఇటీవల దులీప్ ట్రోఫీలోనూ ముషీర్ అద్భుత ఆటతీరును కనబరిచాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘త్వరలోనే కోలుకుంటా. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయ బృందంతో పాటు ఎమ్మెల్యేలు, నేతలు మద్దతుగా ఉంటారు’ అని తెలిపారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతున్న వేళ ఆలయ గోడలపై ఉన్న శాసనాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆలయంలో పురాతన పద్ధతులను గోడలపై ముద్రించారు. 1019CE నాటి శాసనాలు నెయ్యి లాంటి పదార్థాలను వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతున్నాయి. సరైన ప్యాకేజింగ్, రవాణాను అందులో చూపించారు. నెయ్యిని రవాణా చేసేందుకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారని ఉంది.
న్యూ రిటెన్షన్ పాలసీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉదయం 11:30 గంటలకు బెంగళూరులోని ఓ హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది. 24 గంటల్లోనే కొత్త రూల్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. రిటెన్షన్ పాలసీకే అన్ని టీమ్స్ మొగ్గు చూపిస్తుండగా, ఎంత మంది ఆటగాళ్లను జట్టు అంటిపెట్టుకోవాలనేది గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించనుంది.
డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్‌పై సైబర్ గూఢచర్యం కేసులో ముగ్గురు ఇరానియన్లపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం క్రిమినల్ ఛార్జెస్ రిజిస్టర్ చేశారు. మరికొందరు హ్యాకర్లతో కలిసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తరఫున వీరు ఏడాదిగా కుట్ర చేస్తున్నారని US అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చెప్పారు. ట్రంప్ క్యాంపెయిన్ కీలక డాక్యుమెంట్లు దొంగిలించి జర్నలిస్టులు, జో బైడెన్ సంబంధీకులకు పంపారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.