news

News September 28, 2024

ఐఫా-2024 విజేతలు వీరే

image

* ఉత్తమ చిత్రం-జైలర్(తమిళం)
* ఉత్తమ నటుడు- నాని(దసరా), విక్రమ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ నటి- ఐశ్వర్యా రాయ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ విలన్-ఎస్జే సూర్య(తమిళం-మార్క్ ఆంటోనీ)
* ఉత్తమ విలన్-షైన్ టామ్ చాకో(తెలుగు-దసరా)
* ఉత్తమ దర్శకుడు-మణిరత్నం (PS-2)
* ఉత్తమ సంగీత దర్శకుడు-ఏఆర్ రెహమాన్

News September 28, 2024

MUDA SCAM: సిద్దరామయ్యపై FIR నమోదు

image

ముడా స్కామ్‌ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. IPC 351, 420, 240, 09, 120B సెక్షన్లను ప్రయోగించారు. సిద్దరామయ్య భార్య పార్వతి, బావమరిది, ఇతరుల పేర్లను అందులో మెన్షన్ చేశారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఈ చర్యలు చేపట్టింది. రూ.56 కోట్ల విలువైన 14 సైట్లను పార్వతికి ముడా కేటాయించడంతో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

News September 28, 2024

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ సూసైడ్

image

TG: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో AR కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి కలెక్టరేట్‌లో డ్యూటీలో ఉండగా తన తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 28, 2024

పాత పేమెంట్ సిస్టమ్స్‌కు పాతరేస్తున్న UPI: జేపీ మోర్గాన్

image

భారత్ సహా ఆసియాలోని చాలా దేశాలు ACH వంటి పాత పేమెంట్ మెథడ్స్‌కు ముగింపు పలుకుతున్నాయని JP MORGAN ఎగ్జిక్యూటివ్ మ్యాక్స్ న్యూకిర్చెన్ అన్నారు. UPI వంటి రియల్‌టైమ్ పేమెంట్ సిస్టమ్స్ మూమెంటమ్ బాగా పెరిగిందన్నారు. ఈ పాపులారిటీ హెల్త్‌కేర్ సహా అన్ని రంగాల్లో UPIని వాడేలా పుష్ చేస్తోందన్నారు. అందుకే క్లైంట్లకు నేరుగా సేవలు అందించేందుకు ONDCతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు.

News September 28, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా 24,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీల ద్వారా ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

News September 28, 2024

నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట వ్యాపారవేత్తలను ఆమె బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి తిలక్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, FIR నమోదుకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

News September 28, 2024

కార్తీ ‘సత్యం సుందరం’ రివ్యూ & రేటింగ్

image

కుటుంబ తగాదాలతో చాలా కాలం తర్వాత సొంత ఊరుకు వెళ్లిన వ్యక్తికి ఎదురైన పరిణామాలే ‘సత్యం సుందరం’. సూపర్ హిట్ ‘96’ మూవీ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సారి పల్లెటూరి కథను ప్రేక్షకులకు అందించారు. కార్తీ, అరవింద్ స్వామి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే కామెడీ, ఎమోషనల్ టచ్, మ్యూజిక్, డైలాగ్స్ చిత్రానికి ప్రధాన బలం. స్లో నెరేషన్, సినిమా లెంగ్త్ మైనస్.
రేటింగ్: 3.25/5

News September 28, 2024

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు

image

TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడిగించింది. ప్రభుత్వ కళాశాలల్లో రూ.500 జరిమానాతో, ప్రైవేట్ కాలేజీల్లో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించింది. కాగా విద్యార్థులను చేర్పించే కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో? లేదో? గమనించుకోవాలని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది.

News September 28, 2024

చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు: రోజా

image

AP: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. ఆయన షూ వేసుకునే పూజలు చేస్తారని అన్నారు. గతంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పిన పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News September 28, 2024

నేడు రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.

error: Content is protected !!