India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.
TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
AP: ఇంటర్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉ.9గంటల నుంచి 10.30 గంటల వరకు, సెకండియర్ వారికి ఉ.11 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
TG: ఐసెట్‌లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 30 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30న రిజిస్ట్రేషన్లు, OCT 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రవేశాల కమిటీ ఛైర్మన్ శ్రీదేవసేన తెలిపారు. OCT 1,2 తేదీల్లో ఆప్షన్ల నమోదు, 4న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్లు పొందిన వారు 5 నుంచి 7 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 6న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ గాయపడ్డారు. వెన్నుకి సంబంధించిన సమస్య తలెత్తడంతో ఆయన వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో భారత్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గ్రీన్ పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ENGతో సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి గాయాల బారిన పడ్డ ఆసీస్ ప్లేయర్ల సంఖ్య ఐదుకి చేరింది. కాగా భారత్, AUS మధ్య NOV 22న తొలి టెస్ట్ జరుగనుంది.
AP: TDP కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగదీశ్, సుబ్బారావు, వినోద్, హరిబాబు, ఆంజనేయులు, షేక్ అమితా, రాజులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడాన్ని బట్టి ఈ ఉత్తర్వులు కొనసాగుతాయంది. ఇప్పటికే అవినాశ్, అప్పిరెడ్డి, రఘురాం, ఒగ్గు గవాస్కర్‌లకు అరెస్ట్ నుంచి సుప్రీం ఊరట కల్పించింది.
భారీ అంచనాలతో విడుదలైన జూ.ఎన్టీఆర్ ‘దేవర’ తొలిరోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా నిన్న రూ.140 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. AP, TGలోనే రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో రూ.7 కోట్లు వసూలు చేసిందని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.140 కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
TG: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు HYD రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ముర్ముకు స్వాగతం పలకడం నుంచి ఆమె తిరిగి వెళ్లే వరకు సీతక్క రాష్ట్రపతి వెంటే ఉండనున్నారు. బేగంపేట, HPS, PNT జంక్షన్, రసూల్‌పురా, CTO ప్లాజా, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి.
ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటనల ముందస్తు ఏర్పాట్ల కోసం రెండు అడ్వాన్స్ టీమ్స్‌ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు చేయాల్సిన పనులపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. సీఎం పర్యటనలకు 24 గంటల ముందు ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తాయి.
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే హైందవేతరులు పాటించాల్సిన నిబంధనల గురించి TTD బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ATC సర్కిల్, గోకులం వద్ద బోర్డులు పెట్టింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాల్లో పత్రాలు అందుబాటులో ఉంటాయంది.
Sorry, no posts matched your criteria.