news

News September 28, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: CBN
* జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు
* నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: జగన్
* వైసీపీ పాలనలో అవినీతి పెరిగింది: పురందీశ్వరి
* TG: ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం: మంత్రి సీతక్క
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
* ఎనుముల రేవంత్ ఎగవేతల రేవంత్‌గా మారారు: హరీశ్

News September 28, 2024

దయచేసి విపరీతార్థాలు తీయకండి: రామజోగయ్య శాస్త్రి

image

ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే రిజల్ట్ ‘దేవర’లా ఉంటుందని తాను అన్న మాటకు విపరీతార్థాలు తీయొద్దని రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఓరి నాయనో. ఇది ఎటో దారితీస్తున్నట్లుంది. నా ఉద్దేశం శివ తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారనే తప్ప మరొకటి కాదు. విపరీతార్థాలు తీయవద్దని మనవి’ అని ట్వీట్ చేశారు. ఎవరి పని వాళ్లను చేసుకోనివ్వాలంటూ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో అన్న సంగతి తెలిసిందే.

News September 28, 2024

ఎన్టీఆర్ ‘దేవర’ వచ్చేది ఈ ఓటీటీలోకే?

image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌(OTT)లో రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

News September 28, 2024

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణపై ఈ నెల 30వ తేదీ నుంచి సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. HYD మాసబ్‌ట్యాంక్ కార్యాలయంలో అభిప్రాయాలు తెలియజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. commr.scsubclassification@gmail.comకు కూడా అభిప్రాయాలు పంపవచ్చని సూచించింది.

News September 28, 2024

సూపర్ హిట్ సినిమాను వీక్షించిన సుప్రీంకోర్టు సిబ్బంది

image

గత ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన 12TH ఫెయిల్ చిత్రాన్ని సుప్రీంకోర్టు సిబ్బంది కోసం స్పెషల్ షో వేశారు. CJI చంద్రచూడ్ దంపతులతో సహా 600 మంది ఈ మూవీని వీక్షించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడానికి, దేశాన్ని సరికొత్త శిఖరాల వైపు నడిపించడానికి స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నట్లు సీజేఐ తెలిపారు. ప్రతి రోజూ ఏదైనా మెరుగైన పనిచేయడానికి ఈ సినిమా ప్రేరణనిస్తుందన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

News September 28, 2024

ఫ్రెండ్ బర్త్‌డే ఈవెంట్‌లో తళుక్కుమన్న మహేశ్!

image

మహేశ్ బాబు జక్కన్న డైరెక్షన్లో చిక్కుకున్నప్పటి నుంచీ ఆయన అభిమానులు అప్‌డేట్ కోసం విలవిల్లాడుతున్నారు. అప్‌డేట్ సంగతి అలా ఉంచి, తమ హీరోను మళ్లీ ఎప్పుడు చూస్తామో అంటూ వాపోతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్‌కు మహేశ్ వెళ్లగా ఆ ఫొటోల్ని SSMB ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మహేశ్‌ ఈ లుక్‌లో ఎలా ఉన్నారు?

News September 28, 2024

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా.. ఇది కూడా పరిశీలించండి

image

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నేప‌థ్యంలో ఎల‌క్ట్రానిక్ బ్రాండ్స్ ప్రైస్ వార్‌కు తెరలేపాయి. ఈ-కామ‌ర్స్‌లకు ధీటుగా షావోమీ, శాంసంగ్ లాంటి సంస్థ‌లు త‌మ సొంత ఆన్‌లైన్ స్టోర్స్‌లో కూడా సేల్స్ ప్రారంభించాయి. ఈ-కామ‌ర్స్ కంటే అధిక ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్లు, ఏ బ్యాంక్ కార్డుపై అయినా ధ‌ర‌ల త‌గ్గింపు ఇస్తున్నాయి. కాబ‌ట్టి షాపింగ్ చేసే ముందు ఈ-కామర్స్, ప్రొడ‌క్ట్ సంస్థ పోర్టల్‌లో ధరలు చెక్ చేసుకోండి. SHARE IT.

News September 28, 2024

అప్పటిదాకా దాడులు ఆపేది లేదు: నెతన్యాహు

image

ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ ప్రమాదకర శత్రువులను ఎదుర్కొంటుందని అధ్య‌క్షుడు నెత‌న్యాహు అన్నారు. UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ హమాస్ ఆయుధాలు విడిచే వరకు త‌మ‌ను తాము కాపాడుకొనేందుకు దాడులు చేస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ‘నా దేశం యుద్ధంలో ఉంది. ఈ ఏడాది ఇక్కడికి రాకూడదనుకున్నా. అయితే ఇజ్రాయెల్‌పై తప్పుడు ఆరోపణలు విని వాటిని సరిదిద్దడానికి రావాలని నిర్ణయించుకున్నా’ అని నెతన్యాహు అన్నారు.

News September 28, 2024

హైడ్రా భయం.. మహిళ ఆత్మహత్య

image

TG: కూకట్‌పల్లి పరిధిలో హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా ఇళ్లు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని చనిపోయారు. కాగా ప్రతి రూపాయి పోగేసి కట్టిన 3 ఇళ్లను ముగ్గురు కూతుళ్లకి కట్నంగా ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కూల్చేస్తామని చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

News September 28, 2024

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ రిజిస్ట్రేషన్లపై తదుపరి చర్యలు చేపడుతుందని వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేరుతో జీవో జారీ అయ్యింది.

error: Content is protected !!