India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ రిజిస్ట్రేషన్లపై తదుపరి చర్యలు చేపడుతుందని వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేరుతో జీవో జారీ అయ్యింది.
TG: రాబోయే ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెడతామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా, సమర్థంగా ఉంటేనే కుటుంబ వృద్ధి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో సరస్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పని మహిళా గ్రూపులకు ఇచ్చినట్లు తెలిపారు. 17 రకాల వ్యాపారాలు గుర్తించి వడ్డీలేని రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని పేర్కొన్నారు.
ఇండియాలో ఓ వ్యక్తి సుఖంగా జీవించేందుకు నెలకు రూ.30-40వేలు సంపాదిస్తే సరిపోతుంది. కానీ, కెనడాలోని టొరంటోలో ఉద్యోగం చేస్తోన్న ఓ ఇండియన్ టెకీ ఏడాదికి రూ.75లక్షలు సంపాదించినా సంతోషంగా ఉండలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ఓ బ్యాంకులో టీమ్‌లీడ్‌గా పనిచేస్తుండగా ఇంటి అద్దె నెలకు రూ.లక్ష చెల్లిస్తోంది. తన ఎక్స్‌పీరియన్స్‌కు తక్కువ జీతం వస్తోందని, ఇక్కడ నివసించడం చాలా కష్టంగా ఉందని తెలిపింది.
AP: ఐదేళ్లు CM హోదాలో జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడేమీ మాట్లాడకుండా ఇప్పుడు డిక్లరేషన్ అడగడమేంటని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామిని ముందుపెట్టి మత రాజకీయాలు చేయడం తగదని కూటమి పార్టీలకు హితవు పలికారు. Dy.cm పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా? మరి ఆయన తిరుమలకు డిక్లరేషన్ ఇచ్చే వెళ్తున్నారా? అని నిలదీశారు.
AP: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.
☞ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు
☞ అంబేడ్కర్ కోనసీమ అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్
☞ జగ్గయ్యపేట అసెంబ్లీ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు
☞ విజయవాడ వెస్ట్ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు
☞ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు
☞ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రామ్
AP:ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలని డిప్యూటీ CM పవన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాలి. స్థానిక MLAలు, MPలు, MLCలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేశారు’ అని తెలిపారు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని అభిమానులు అంటున్నారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ప్రతి ఒక్కరి కష్టమే ఈ ఫలితమని మూవీ సక్సెస్ మీట్‌లో తెలిపారు. ఎవరి పనులు వారిని చేసుకోనిస్తే ఇలాంటి సక్సెస్‌లు వస్తాయని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఈ సినిమాకు త్వరలోనే విజయోత్సవ సభ ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు APలోని అల్లూరి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అటు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.