India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. గనుల కేటాయింపులలో పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొన్ని వారాలుగా అజ్ఞాతంలో ఉన్న వెంకటరెడ్డిని నిన్న హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వదేవ్, ప్రియదర్శి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 2 నుంచి AHAలో అందుబాటులోకి రానుంది. ‘ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది’ అంటూ AHA Xలో రాసుకొచ్చింది. SEP 6న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నందకిశోర్ ఇమాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించారు.
AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఫ్యాక్టరీని మరో ప్రభుత్వ రంగ సంస్థ SAIL(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్లాంట్‌కు రుణాలు అందించడం, దానికి సంబంధించిన 1,500-2,000 ఎకరాల భూమిని NMDCకి విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
TG: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీని కోసం ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుందని సీఎం వివరించారు.
‘దేవర’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ నటనను వర్ణించేందుకు మాటలు రావట్లేదని చెప్పారు. దేవర మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడారు. డే-1 టాప్-2 గ్రాసర్‌గా దేవర నిలిచే అవకాశముందని దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్‌కు ఎన్టీఆర్ కారణమన్నారు. తెలుగు సినిమాకు విదేశాల నుంచి వస్తున్న స్పందన అద్భుతమని పేర్కొన్నారు.
ఎంత సంపాదించినా అందులో సగం ఇంటి రెంట్‌కే పోతోందని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అంతలా పెరిగిపోయాయ్ మరి అద్దె ధరలు. ఈ నేపథ్యంలో ముంబైలోని పాలి హిల్‌లో 2BHK ఫ్లాట్‌లో ఉండాలంటే రూ.1.35 లక్షలు చెల్లించాలనే ఓ ప్రకటన వైరలవుతోంది. బాత్రూమ్‌లో టాయిలెట్ సింకు పైనే వాషింగ్ మెషీన్ అమర్చడం, రూ.4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బులతో కొత్త ఫ్లాట్ కొనుక్కోవచ్చంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. యువతి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, మైనర్‌గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేశాననడమూ అవాస్తవమని పేర్కొన్నట్లు సమాచారం. యువతి తీరుతో తానే బాధపడ్డానని, పెళ్లి చేసుకోమని వేధించిందని, తనపై కావాలనే కుట్ర చేశారని జానీ తెలిపినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.
TG: ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కుమారుడు వైష్ణవ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ బస్ అనే సీనియర్ తన కొడుకుతో గొడవపడి చెవి కొరికేశాడని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: అమీన్‌పూర్‌లో ఓ బిల్డింగ్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు వర్చువల్‌గా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కేరళలోని త్రిసూర్‌లో 3 ATMలను లూటీ చేసి ₹60 లక్షలతో ఉడాయిస్తున్న హరియాణా ముఠాను తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఒక ట్రక్కులో TNలోకి ప్రవేశించిన ఈ ఏడుగురు సభ్యుల మూఠాను నమక్కల్ పోలీసులు 12KM ఛేజింగ్ చేశారు. వారు పోలీసులపై దాడి చేసి ఇద్దర్ని గాయపర్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముఠా సభ్యుడొకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ట్రక్కు, అందులోని కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.