India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు విలువ తగ్గిపోయిందని BRS MLA హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌కు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి రెండు పంటలు వచ్చేలా చేస్తే కాంగ్రెస్ మాత్రం కరెంట్ కోతలు విధిస్తోందని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ వచ్చినా రైతుబంధు, బోనస్ ఇవ్వడం లేదన్నారు.
AP: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అటవీ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. కుంకీ ఏనుగులు శిక్షణ పొంది ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో సంచరించే వాటిని తిరిగి అడవిలోకి తీసుకెళ్తాయి.
TG: మంత్రి పొంగులేటి నివాసంలో ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈమేరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంతో పాటు హిమాయత్ సాగర్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో, బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరుగుతున్నాయి. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.
AP: తిరుమలకు మాజీ సీఎం జగన్ వస్తుంటే ప్రభుత్వం వణుకుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్‌ను డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పారు. ‘హిందువులంటే బీజేపీ కార్యకర్తలేనా? బీజేపీ చెప్పిన వారే హిందువులా? జగన్‌ను అడ్డుకునే హక్కు టీటీడీకి లేదు. ఆయన ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు. ఎప్పుడూ అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
కాన్పూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ నిలిచిపోగా అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఈ సమయానికి 26 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా 74 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో వచ్చిన ‘GOAT’ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ, ‘GOAT’ మూవీ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మొత్తం 3 గంటల సినిమాను అప్లోడ్ చేశారు. దీనిపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.
TG: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని నివాసంతో పాటు ఆయన కన్‌స్ట్రక్షన్ కంపెనీలోనూ అధికారులు సోదా చేస్తున్నారు. మంత్రి కుమార్తె ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
AP: తిరుపతిలో మాజీ CM జగన్‌పై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని YCP ఆరోపించింది. ‘BJP నేత భానుప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, TDP నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. జగన్ వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు?’ అని YCP ట్వీట్ చేసింది.
క్రికెటర్లతో పోలిస్తే హాకీ ప్లేయర్లే ఎక్కువ ఫిట్‌గా ఉంటారని టీమ్ఇండియా స్టార్ మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘యోయో టెస్టులో 19 లేదా 20 స్కోర్ వస్తేనే క్రికెటర్లను ఫిట్టెస్ట్ అనేస్తారు. హాకీలో మా గోల్ కీపర్ శ్రీజేశ్ స్కోరే 21. మొత్తం 8 స్ప్రింట్స్ ఉండే ఈ టెస్టులో 23.8 హయెస్ట్ స్కోర్. మా టీమ్‌లో ఏడుగురు దీనిని సాధించారు. మా జూనియర్ గర్ల్స్ స్కోరే 17-18గా ఉంటుంది’ అని వివరించారు.
TG: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి హైడ్రా నోటీసులు పంపింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని నల్లవాగును శిల్పా కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా సర్వే చేపట్టి వెంచర్‌లోని ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.