news

News February 27, 2025

‘పంజా విసిరే పులులు’.. ఐసీసీ ట్రోఫీల్లో అఫ్గాన్ హవా

image

తాము పసికూనలం కాదు పంజా విసిరే పులులం అని అఫ్గానిస్థాన్ మరోసారి నిరూపించింది. 2023 వన్డే WC నుంచి ఆ జట్టు పెద్ద టీంలకు ఝలక్ ఇస్తోంది. 2023 WCలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది. 2024 టీ20 WCలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్‌కు వెళ్లింది. తాజాగా CTలో ఇంగ్లండ్‌ను ఓడించి ఇంటిదారి పట్టేలా చేసింది. తమ దేశంలో సరైన ప్రాక్టీస్ సౌకర్యాలు లేకున్నా అఫ్గాన్ రాణించడం విశేషం.

News February 27, 2025

కొత్త రూల్.. వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్‌‌లు మస్ట్!

image

TG: ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్‌లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, గూడ్స్ వెహికల్స్‌కు (కొత్త, పాత) ఈ రూల్‌ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా TGలో ఇది అమలు కానుంది. ఈ రూల్‌ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.

News February 27, 2025

IND, PAK జట్ల మధ్య తేడా అదే: పాక్ కోచ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ త్వరగా నిష్క్రమించడానికి వన్డేల్లో అనుభవం లేకపోవడమే ప్రధాన కారణమని ఆ జట్టు హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్ అన్నారు. టీమ్ ఇండియాలోని ప్లేయర్లు ఆడిన మ్యాచుల సంఖ్య 1500 ఉంటే, పాక్ ఆటగాళ్ల మ్యాచుల మొత్తం 400కి తక్కువగా ఉందన్నారు. బాబర్ ఆజమ్ ఒక్కడే 100కి పైగా మ్యాచులు ఆడారని పేర్కొన్నారు. అలాగే ఒకే గ్రౌండ్‌లో ఆడుతుండటం కూడా INDకి అడ్వాంటేజ్‌గా మారిందని అభిప్రాయపడ్డారు.

News February 27, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డీఈవోలు సెలవు ప్రకటించినా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మీకు సెలవు ఇచ్చారా?

News February 27, 2025

MLC ఎలక్షన్స్.. ఇలా ఓటేయండి!

image

☞ అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బాక్సులో ప్రాధాన్యత ప్రకారం అంకె వేయాలి.
☞ కచ్చితంగా ఎవరికో ఒకరికి తొలి ప్రాధాన్య ఓటు వేయాలి. 1 నంబర్ ఇవ్వకుండా 2, 3, 4 అంకెలు వేస్తే ఓటు చెల్లదు.
☞ ఒక అభ్యర్థికి ఒక నంబర్ మాత్రమే ఇవ్వాలి. ఒకే నంబర్‌ను ఇద్దరు, ముగ్గురికి వేసినా ఓటు చెల్లుబాటు కాదు.
☞ ఓటు వేసేందుకు పోలింగ్ సిబ్బంది ఇచ్చే స్కెచ్‌నే వాడాలి.
☞ బ్యాలెట్‌పై టిక్ చేయడం, పేర్లు రాయడం వంటివి చేయొద్దు.

News February 27, 2025

రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ ఏంటి?: శ్యామల

image

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి? అని YCP అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ‘ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని అక్రమ అరెస్టు ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

News February 27, 2025

నేడు SLBC టన్నెల్‌కు BRS బృందం

image

TG: ప్రమాదం జరిగిన SLBC టన్నెల్ వద్దకు ఇవాళ బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నాయకులు HYDలోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లనున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకోవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.

News February 27, 2025

100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే!

image

దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో 100 కోట్ల మంది సంపాదన అంతంతమాత్రమే అని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు 13-14కోట్లే అని పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సుల్లోంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేశారని తెలిపింది. మరోవైపు, దేశంలోని 57.7శాతం సంపద కేవలం 10శాతం మంది భారతీయుల వద్దే ఉందని బ్లూమ్ వెంచర్స్ స్పష్టం చేసింది.

News February 27, 2025

మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి.

News February 27, 2025

సెలీనియం అంటే?

image

<<15592975>>సెలీనియం<<>> అనేది నీరు, కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి శరీరానికి సహజంగా అందే ఖనిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, పునరుత్పత్తి అవయవాలు పని చేసేందుకు చాలా అవసరం. దీని అవసరం కొంతే అయినా ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ సెలీనియం మోతాదు ఎక్కువైతే జుట్టు రాలడం, గోళ్లు పెలుసుగా మారటం, చర్మ సంబంధ వ్యాధులొస్తాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.