India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిపురుష్‌లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి రామాయణంలో నటించనున్నారని బీటౌన్ వర్గాలంటున్నాయి. ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్‌లో రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పరశురాముడి రోల్‌లో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఆ మూవీలో ప్రధాన పాత్రల గురించి పలు ప్రచారాలు నడుస్తుండగా, అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు చివరిదైన రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. జోరు మీదున్న భారత్‌పై నెగ్గడం బంగ్లాకు కఠినమైన సవాలే. ఇక తొలి టెస్టులో పంత్, గిల్, అశ్విన్ సెంచరీలతో అదరగొట్టగా ఈ మ్యాచ్‌లో స్టార్లు రోహిత్, కోహ్లీ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో రూ.6.61 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం సమీకరించనుంది. ఇందుకోసం అక్టోబర్- మార్చి మధ్య రూ.20 వేల కోట్ల సావరిన్ బాండ్లతో పాటు సెక్యూరిటీల వేలం నిర్వహించనుంది. ఈ మొత్తంతో రెవెన్యూ లోటు భర్తీ చేయనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14.01 లక్షల కోట్ల రుణాన్ని సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి 6 నెలల్లో రూ.7.4 లక్షల కోట్లను సేకరించింది.
TG: ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. బేగంబజార్లో నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడ్డా పాల్గొంటారు.
TG: మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చే పనులు చేపట్టాలన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బలహీనవర్గాల ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి HYD శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే పనులకు వెళ్లేందుకు కష్టతరంగా మారుతుందని తెలిపారు.
TG: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై HYD కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. పలు పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు భేటీకి హాజరయ్యారు. DJ శబ్ధాల వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని కంట్రోల్ చేయలేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. దీనిపై అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
భద్రతామండలి(UNSC)లో భారత్‌ను చేర్చాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు UNSCలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే. అదే విధంగా ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి. పలు నిబంధనల్నీ మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రోన్ స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. 6 నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.
నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు రెండు మైలురాళ్లు. వాటి సీక్వెల్స్ ఆలోచన తనకుందని ఆయన పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా అవి తెరకెక్కుతాయని సమాచారం. ప్రశాంత్ మోక్షుతో తీస్తున్న సినిమా అవుట్‌పుట్‌ను బట్టి ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.