news

News September 26, 2024

హిందూధర్మం అంటే ఎందుకు చులకన: ఖుష్బూ

image

తిరుపతి లడ్డూ వ్యవహారంలో నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూధర్మమంటే ఎందుకంత లోకువని ప్రశ్నించారు. ‘హిందూమతంపై దాడిని అందరూ లైట్ తీసుకుంటారు. హిందువుల్ని తిట్టేవారిని అడుగుతున్నా. వేరే మతాల్ని ఇలాగే తిట్టగలరా? ఆ ఊహకు కూడా మీ వెన్ను వణుకుతుంది. నేను ముస్లింని. నా భర్త హిందువు. నాకు అన్ని మతాలూ సమానం. తప్పు చేసిన వాళ్లు గుర్తుంచుకోండి. ఆ శ్రీనివాసుడు చూస్తున్నాడు’ అని మండిపడ్డారు.

News September 26, 2024

GOOD NEWS: అక్టోబర్ 1 నుంచి వేతనాలు పెంపు

image

అసంఘటిత రంగం (అన్‌‌ఆర్గనైజ్డ్)లో పని చేసే వర్కర్లకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA) రివైజ్ చేసి కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. OCT 1 నుంచి ఈ కొత్త వేతన రేట్లు అమల్లోకి వస్తాయంది. నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, మైనింగ్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. హైస్కిల్డ్ వర్కర్లకు-రోజుకు రూ.1,035, సెమీస్కిల్డ్ రోజుకు రూ.868, అన్‌స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.783 చెల్లించాలంది.

News September 26, 2024

‘పుష్ప-2’ సెట్‌లో రాజమౌళి సందడి

image

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా మూవీ సెట్‌కు దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. భారతీయ సినిమాకు గర్వకారణమైన డైరెక్టర్ రాజమౌళి దేశంలోనే అతిపెద్ద మాస్ సినిమా సెట్స్‌ను సందర్శించారని పుష్ప టీమ్ ఎక్స్‌లో ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సినిమాలో రాజమౌళి గెస్ట్ అప్పియరెన్స్ ఏమైనా ఉందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

News September 26, 2024

అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయి స్మగ్లింగ్

image

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఏకంగా అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు రవాణా చేస్తోన్న ఇద్దరిని భేరుఘాట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 138 కేజీల గంజాయిని అంబులెన్స్ వెనక భాగంలో చిన్న, పెద్ద ప్యాకెట్లలో దాచినట్లు గుర్తించారు. దీని విలువ మార్కెట్‌లో రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు.

News September 26, 2024

రేపు ఏం జరగబోతోంది..

image

AP: జగన్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. రేపు సా.4 గం.కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. రాత్రి 7 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఉ.10.30 గం.కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది.

News September 26, 2024

‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క టికెట్ రూ.2వేలు!

image

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఒంటి గంటకే షోలు ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టికెట్ ధర రూ.2వేలు పలుకుతున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ షోలకు ఎక్కువగా అభిమానులే వెళ్లే అవకాశం ఉండటంతో క్యాష్ చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది.

News September 26, 2024

రామాయణం పాఠ్యపుస్తకాల్లో ఉండాలి: వెంకయ్య నాయుడు

image

AP: రామాయణ స్ఫూర్తిని భావితరాలకు అందించడం సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేయాల్సిన అవసరముందని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు సెక్యులర్ పేరు చెబుతున్నారని విమర్శించారు.

News September 26, 2024

ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్

image

TG: రేపు ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు.

News September 26, 2024

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2026 టీ20 WC దృష్ట్యా యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన టెస్టు కెరీర్‌ను స్వదేశంలోని మీర్పూర్‌లో SAతో జరిగే టెస్టుతో ముగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ బోర్డు ఒప్పుకోకపోతే INDతో ఆడే రెండో టెస్టే తనకు చివరిదని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ODIల నుంచి తప్పుకోనున్నారు.

News September 26, 2024

బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్!

image

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. B.E/ B.Techలో (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్) 60% మార్కులు సాధించిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ రూ.60వేల నుంచి రూ.1.8లక్షల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకునేందుకు ఈ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించండి.

error: Content is protected !!