India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈరోజు తాను శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించానని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ట్విటర్‌లో తెలిపారు. ‘పెద అమిరంలోని నా స్వగృహంలో ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాను. చంద్రబాబుగారు సీఎం అయ్యాక లడ్డూను స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అద్భుతంగా తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇస్తున్న ప్రసాదంపై భక్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అని హామీ ఇచ్చారు.
పై ఫొటో చూశారా..? వారిద్దరిలో ఒకరు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కాగా మరొకరు ఆయన వీరాభిమాని మున్నా లోహరా. ముఖ్యమంత్రి ఈ పిక్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఒక హేమంత్ మరో హేమంత్‌ను కలిశారు. ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహరాను ఆయన కుటుంబీకులతో సహా కలిసి మాట్లాడాను’ అని పేర్కొన్నారు. లోహరా ప్రస్తుతం సీఎంలా రూపురేఖల్ని మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ ఫొటో నెట్టింట ఆసక్తిని రేపుతోంది.
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రిటైల్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. త్వరలోనే కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.
AP: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లాలో అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్న వేళ ఈ ఆంక్షలు అమల్లోకి తేవడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ADB, ASF, MNCL, BHPL, MLG జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. రేపు ADB, ASF, MNCL, NRML, NZB, JGL, SRCL, KNR, PDPL, MHBD, WGL, HNK జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. 500 T20లు ఆడిన ఆరో క్రికెటర్‌గా అవతరించారు. CPLలో BRvsGAW మ్యాచుతో అతడీ ఘనత సాధించారు. 34 బంతుల్లో 71* రన్స్ చేసినా BRని గెలిపించలేకపోయారు. మిల్లర్ 500 T20ల్లో 34.89 AVG, 137 SRతో 10,678 రన్స్ చేశారు. 455 ఇన్నింగ్సుల్లో 48 ఫిఫ్టీస్, 4 సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 120*. ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగులు ఆడిన అనుభవం అతడికుంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ అరుదైన రికార్డు సృష్టించనుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఒకే రోజు 42 షోలు ప్రదర్శించనున్నారు. ఈ ఘనత అందుకోనున్న తొలి చిత్రం ఇదేనని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ట్వీట్ చేసింది. 1AM షోలు కూడా వేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఈ మల్టీప్లెక్స్‌లో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని అత్యధికంగా ఒకే రోజులో 41 షోలు ప్రదర్శించారు.
తాను RCBలోకి వెళ్లేందుకు యత్నించగా విరాట్ అడ్డుకున్నారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై రిషభ్ పంత్ మండిపడ్డారు. సెన్సిబుల్‌గా ఉండటం నేర్చుకోవాలని క్లాస్ పీకారు. ‘ఇది ఫేక్ న్యూస్. ఎందుకు ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తారు? ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. రోజురోజుకూ తప్పుడు వార్తల ప్రచారం పెరుగుతోంది. ఇది కేవలం మీకు మాత్రమే కాదు. ఇలాంటి పనులు చేసే వారందరికీ కూడా చెబుతున్నా’ అని స్పష్టం చేశారు.
ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురూ భారత క్రికెట్‌లో దిగ్గజాలే. వీరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. ఇదే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఎదురైంది. ఆయన రోహిత్ వైపు మొగ్గు చూపారు. ‘టీ20 ఫార్మాటైతే కచ్చితంగా రోహిత్‌నే ఎంచుకుంటా. అత్యద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో విజయాన్ని అందించగలరు. కచ్చితంగా శర్మే ఫస్ట్ ఛాయిస్’ అని స్పష్టం చేశారు. మీరైతే ఆ ముగ్గురిలో ఎవర్ని సెలక్ట్ చేస్తారు?
తెలంగాణలో ప్రస్తుతం తన అవసరం లేదని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిని చేయడమే ప్రస్తుతం తమ లక్ష్యమన్నారు. అలా జరిగితే ఏపీకి హోదాతో విభజన సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.