news

News September 26, 2024

మరో 3 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులు

image

AP: వైసీపీ అధినేత జగన్ మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు.
1.విశాఖపట్నం- గుడివాడ అమర్నాథ్
2.అనకాపల్లి- ముత్యాల నాయుడు
3. అల్లూరి సీతారామరాజు- భాగ్యలక్ష్మి

News September 26, 2024

నేను రిటైర్ అవడానికి కారణం అదే: శిఖర్ ధవన్

image

క్రికెట్ ఆడాలన్న ఆసక్తి లేకపోవడం వల్లే తాను రిటైరయ్యానని భారత మాజీ బ్యాటర్ శిఖర్ ధవన్ తెలిపారు. ‘రెండేళ్ల నుంచి నాకు పెద్దగా క్రికెట్ అవకాశాల్లేవు. ఐపీఎల్ మాత్రమే ఆడాను. దేశవాళీ క్రికెట్ అసలు ఆడాలనిపించలేదు. ఆటపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమై తప్పుకొన్నా. నా కెరీర్లో సాధించిన దాని పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నా’ అని వివరించారు. భారత్‌ తరఫున ధవన్ 34 టెస్టులు, 167 ODI, 68 T20I మ్యాచులు ఆడారు.

News September 26, 2024

పావురాలకు ఆహారం అందిస్తున్నారా?

image

పట్టణాల్లో పావురాల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం ప్రజలు వాటికి ఆహారం అందించడమే. అయితే, పావురాల ఈకల నుంచి వెలువడిన ధూళి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని చెబుతున్నారు. పుష్టిగా ఆహారం తీసుకున్న పావురం ఏడాదికి సగటున 11.3 KGల రెట్టలను ఉత్పత్తి చేస్తుంది. ఎండిన రెట్ట నుంచి వచ్చిన వాసనను పీల్చితే శ్వాసకోస రోగాలొస్తాయి.

News September 26, 2024

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్

image

సినీ నటుడు అభిషేక్ అరెస్టయ్యారు. SR నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌లలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ తర్వాత అతడిని హైదరాబాద్ సీసీఎస్‌కు తరలించారు. గతంలోనూ పలుమార్లు డ్రగ్స్ కేసులో అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.

News September 26, 2024

ఆల్ ది బెస్ట్ మై బ్రదర్: రామ్ చరణ్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మిత్రుడు ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పారు. రేపు ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘మై బ్రదర్ తారక్, దేవర టీమ్ మొత్తానికి రేపటి కోసం ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. చెర్రీతో కలిసి నటించిన ‘RRR’ తర్వాత వస్తున్న తారక్ తొలి సోలో మూవీ ఇదే కావడం గమనార్హం. కాగా చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ సైతం విడుదలకు సిద్ధమవుతోంది.

News September 26, 2024

ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం

image

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన స్పృహ తప్పి పడిపోయారని, అందుకే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రొటీన్ చెకప్స్ కోసమే ఆయన మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు CMO ప్రతినిధులు చెప్పారు. ఆయనకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.

News September 26, 2024

పంత్ ఆస్ట్రేలియన్ అయ్యుంటే బాగుండేది: మార్ష్

image

టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ తమ దేశస్థుడు అయి ఉంటే బాగుండేదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అభిలషించారు. ‘పంత్ అద్భుతమైన ఆటగాడు. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తుంటారు. బయటికి ఎప్పుడూ నవ్వుతూ రిలాక్స్‌గా ఉన్నట్లు కనిపిస్తారు గానీ చాలా పోటీతత్వం కలిగిన మనిషి. పెద్ద కష్టాన్ని ఎదుర్కొని తిరిగొచ్చారు. తనకు ఇంకా చాలా కెరీర్ ఉంది’ అని పొగడ్తలు కురిపించారు. IPLలో పంత్, మార్ష్ కలిసి DCకి ఆడారు.

News September 26, 2024

అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తాం: శ్రీలంక అధ్యక్షుడు

image

దేశంలోని ఏ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే హామీ ఇచ్చారు. ‘అందరికీ నాణ్యమైన విద్య అందించడం ద్వారా రాబోయే తరం భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మన దేశంలోని యువ తరానికి మంచి భవిష్యత్తును నిర్మిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News September 26, 2024

పెట్రోల్ రేటు తగ్గింపు?

image

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) రేట్లు భారీగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో బ్యారెల్ రేట్ 83-84 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ లీటరుపై రూ.2 తగ్గించారని, ఇప్పుడు బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయిందని పేర్కొంది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.2-3 చొప్పున తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

News September 26, 2024

సనాతన ధర్మం అంటే ఏంటి?

image

సనాతనం అంటే శాశ్వతమైన, పవిత్రమైన, స్థిరమైన అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వతంగా నిలిచే ధర్మం అని పండితులు చెబుతారు. హిందువులు తమను తాము సనాతన వాదులుగా పిలుచుకుంటారు. అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారని అర్థం. హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం అని ప్రవచనకర్తలు నిర్వచిస్తారు. ‘హిందూ’ అనే పదం భౌగోళిక గుర్తింపు కారణంగా విదేశీయుల నుంచి వచ్చిందని సద్గురు చెబుతారు.

error: Content is protected !!