news

News February 27, 2025

స్టార్ కపుల్ మధ్య వివాదం.. కేసులు నమోదు

image

మహిళా బాక్సర్ సావీటీ బూరా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వరకట్నం కోసం వేధించారని సావీటీ ఫిర్యాదు చేయడంతో హరియాణా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పుట్టింటి నుంచి SUV, రూ.కోటి తేవాలని తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. సావీటీపై హుడా కూడా కేసు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కాగా హుడా(2020), సావీటీని(2025) కేంద్రం అర్జున అవార్డులతో సత్కరించింది.

News February 27, 2025

నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 27, గురువారం

image

ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 27, 2025

శుభ ముహూర్తం (27-02-2025)

image

☛ తిథి: బహుళ చతుర్దశి, ఉ.8.41 వరకు
☛ నక్షత్రం: ధనిష్ట, సా.4.28 వరకు
☛ రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
☛ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48 వరకు, మ.2.48-3.36 వరకు
☛ వర్జ్యం: రా.11.21 నుంచి 12.52 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.7.42 గంటల నుంచి

News February 27, 2025

TODAY HEADLINES

image

* ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM రేవంత్
* సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ కీలక సూచనలు
* SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు
* సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
* తెలంగాణ వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ
* 36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR
* మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్
* విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు
* ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్ సంచలన విజయం

News February 27, 2025

పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

image

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

News February 27, 2025

అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.

News February 27, 2025

Vi, ఎయిర్‌టెల్ కస్టమర్లను ఆకర్షిస్తున్న BSNL ఆఫర్

image

లాంగ్‌టర్మ్ వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న ఓ ఆఫర్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోందని సమాచారం. 336 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 24GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఇతర ఫీచర్లను BSNL రూ.1499కే అందిస్తోంది. 24GB ముగిశాక 40kbps స్పీడుతో ఉచితంగా నెట్ పొందొచ్చు. ప్రస్తుతం వి, ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను రూ.1849కి అందిస్తుండటంతో కస్టమర్లు ఆలోచిస్తున్నారు.

News February 26, 2025

రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 26, 2025

పోసాని అరెస్ట్ దుర్మార్గం: అంబటి

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ దుర్మార్గమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా పోలీసులు దుందుడుకుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ‘అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు. కూటమి సర్కార్ చట్టాలను తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.