India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: గుజరాత్ మోడల్ అంటే హిందూ, ముస్లిం మధ్య గొడవలు తీసుకొస్తారా అని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్.. నువ్వు కాంగ్రెస్ మనిషివా? బీజేపీ మనిషివా? గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ అంటారు. రేవంత్ ఏమో సూపర్బ్ అని అంటారు. లిక్కర్ స్కామ్ లేదని రాహుల్ అంటే, ఉందని సీఎం అంటారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క ఓటు రేవంత్‌కు వేసినా అది బీజేపీకే లాభం’ అని అన్నారు.

మరికొన్ని గంటల్లో SRHvsMI మ్యాచ్ ప్రారంభంకానుండగా జియో సినిమాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లను రిలీజ్ చేసింది. ‘సౌత్ సైడ్ నుంచి పాతబస్తీ, వెస్ట్ సైడ్‌లో కొండాపూర్, సీదా సెంటర్‌లో బేగంపేట.. అన్ని సైడ్స్ నుంచి కుర్చీ మడతపెట్టడానికి వచ్చారు సన్ రైజర్స్’ అని పేర్కొంటూ.. పాతబస్తీ.. పాట్, కొండాపూర్.. క్లాసెన్, బేగంపేట.. భువి అంటూ ఫొటోలు షేర్ చేసింది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచేదెవరో కామెంట్ చేయండి.

సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్‌కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం & NGRI స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది.

TG: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపారట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఐపీఎల్‌లో ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పించడంపై సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ స్పందించారు. ఈ రూల్‌తో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే వెసులుబాటు పేసర్లకు ఉపయోగకరమని చెప్పారు. తనకు కెప్టెన్ రుతురాజ్‌తో పాటు మహీ భాయ్ సూచనలు కీలకమని పేర్కొన్నారు.

ప్రముఖ హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ మూడుముళ్లు వేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితి ఒకరు. ‘మహా సముద్రం’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు టాక్. సిద్ధార్థ్, అదితిరావు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జనసేనాని పవన్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలను అందించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. పెద్దల పట్ల గౌరవంగా ఉంటాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చెర్రీ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని పవన్ ఆకాంక్షించారు.

విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆసియా మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈనెలలో భారత్ ఏకంగా $3.63 బిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. 2023 డిసెంబరు తర్వాత ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. భారత్ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా ($2.9 బిలియన్లు), తైవాన్ ($1.1 బిలియన్లు), ఇండోనేషియా ($584 మిలియన్లు) ఉన్నాయి. ఇక జపాన్, థాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల్లో FII భారీగా తగ్గాయి.

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Way2News లోగోతో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఈ ఫేక్ ఉచ్చులో పడకుండా, ఇతరులూ మోసపోకుండా ఆపడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. Way2News పేరుతో స్క్రీన్ షాట్ వస్తే అందులోని కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ వార్త కన్పిస్తే ఆ పోస్టు మేము పబ్లిష్ చేశామని అర్థం. ఆ వార్త రాలేదంటే మీకు ఫేక్ స్క్రీన్‌షాట్ వచ్చిందని గ్రహించాలి.
Sorry, no posts matched your criteria.