India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరి సిట్టింగ్ పార్లమెంట్‌లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఈరోజు ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులకు సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
HYDలో ఉన్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవితోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
నిన్న జరిగిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు గవర్నర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రభుత్వానికి సహకరించాలని భట్టి గవర్నర్‌ను కోరారు.
అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం HYDలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటర్‌నెట్ సాయంతో అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను లోకల్ కాల్‌గా మారుస్తున్న హిదాయత్‌అలీ(40), అహ్మద్(40)ను అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వీరి వద్ద 3 యాక్ట్ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, సిమ్ కార్డ్ బాక్స్‌లు(32 స్లాట్‌లు), 3 రూటర్‌లు, 6 లాప్‌ట్యాప్‌లు, 2 హార్ట్ డిస్క్‌లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాసరావు, డీసీపీ ఎస్.రేష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?
అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్‌లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్‌లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్: 12
*పటాన్‌చెరు-CBS రూట్: 6
*పటాన్‌చెరు-కోఠి రూట్: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.