India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులో బుధవారం విషాదఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్ టైమ్ సెటిల్‌మెంట్) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ HYDలో కాంగ్రెస్ బలాన్ని పెంచుకుంటోంది. నిన్న మధ్యాహ్నం వరకు BJP కార్యక్రమాల్లో పాల్గొన్న కంటెస్టెడ్ MLA శ్రీగణేశ్.. ఎవరూ ఊహించని విధంగా సాయంత్రమే హస్తం కండువా కప్పుకొన్నారు. కంటోన్మెంట్ INC టికెట్ దాదాపు ఆయనకే ఖరారైందని టాక్. మరోవైపు BRS టికెట్ తనకే ఇవ్వాలని సాయన్న కూతురు నివేదిత అడుగుతున్నారట. ఇక BJP అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది.
HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరును జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజధానిలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకానుంది. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో BRS 17, MIM 7, INC 3, BJP 1 స్థానాల్లో విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో వలసలు జోరందుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.
మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు MP ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.