India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల వేళ BJPకి బిగ్ షాక్ తగిలింది. BJP సీనియర్ నేత, ఆ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ నేడు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. సీనియర్ నేతలు మహేశ్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా గత ఎన్నికల్లో శ్రీగణేశ్ పై BRS నేత లాస్య నందిత గెలిచారు. కాంగ్రెస్ తరఫున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేశారు.
ఈనెల 27న HYD ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. స్టేడియం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఏరివేతకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
గ్రేటర్ HYDలోని మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పనులు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న నాలాలు, మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ చర్యలపై సర్వే చేస్తున్నారు. 2023-24లో రూ.543.26 కోట్లతో 888 పనులను ఆమోదించగా అందులో 311 రూ.162.53 కోట్లతో పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
కాంగ్రెస్‌లోకి HYD BRS నేతలు చేరుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో నలుగురు MLAలే ఉన్నట్లు టాక్. ఇప్పటికే MP రంజిత్ రెడ్డి, MLA దానం, బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కరిద్దరు MLAలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. MP ఎన్నికల వేళ పార్టీ మార్పుల అంశం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.
ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటెక్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారం కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుందని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్‌గా అనుమతులు ఇవ్వమని కమిషనర్ స్పష్టం చేశారు. 10PM నుంచి 6AM లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దన్నారు.
SHARE IT
తీసుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరి మధ్య జరిగిన గొడవలో వ్యక్తిని కొడవలితో హత్య చేసిన ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగా కాలనీకి చెందిన షేక్ నిసార్ అహ్మద్, ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన షేక్ వాజిద్ స్నేహితులు. వాజిద్ తన అవసరం నిమిత్తం నిస్సార్ వద్ద రూ.3లక్షలు తీసుకొని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో హత్య జరిగింది.
Sorry, no posts matched your criteria.