Telangana

News May 31, 2024

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరఫున ఈవో రమాదేవి, ఉప ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారులు డప్పుచప్పుళ్ల మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్‌కు పట్టువస్త్రాలను అందజేశారు.

News May 31, 2024

నల్గొండ: రూ.524.85 కోట్లతో బైపాస్

image

నల్గొండ బైపాస్‌ను 14 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి కేంద్రంతో, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు ఆచరణ రూపం దాల్చనున్నాయి. నార్కట్ పల్లి- అద్దంకి జాతీయ రహదారికి, మాచర్లకు వెళ్లే హైవేను అనుసంధానిస్తూ నిర్మించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే టెండర్లు పిలవనున్నారు.

News May 31, 2024

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరుపున ఈవో రమాదేవి, ఉప ప్రధన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారలు డప్పుచప్పులు మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్‌కు పట్టువస్త్రాలను అందజేశారు.

News May 31, 2024

నిజామాబాద్ సివిల్ సప్లై DSO, DM సస్పెన్షన్

image

నిజామాబాద్ సివిల్ సప్లై DSO చంద్ర ప్రకాశ్, DM జగదీశ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌరసరఫరాల MD DSచౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రధానంగా ఏడు రైస్ మిల్లులకు సంబంధించి CMR కేటాయింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, DSO పూర్తి సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. విచారణ నివేదిక అనంతరం ఇద్దరు అధికారులపై ఏకకాలంలో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువరించారు.

News May 31, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

జూన్ 4న జరిగే మహబూబ్ నగర్ లోక్ సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైటింగ్, భారీకేడ్లు, పార్కింగ్ ఏర్పాట్లపై సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News May 31, 2024

కాంగ్రెస్ కుట్రను భగ్నం చేస్తాం: మల్కాజిగిరి MLA

image

తెలంగాణ రాజముద్రపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక గుర్తులు కాదని, అవి మన తెలంగాణ చరిత్రకు గుర్తులన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరించి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు.

News May 31, 2024

కాంగ్రెస్ కుట్రను భగ్నం చేస్తాం: మల్కాజిగిరి MLA

image

తెలంగాణ రాజముద్రపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక గుర్తులు కాదని, అవి మన తెలంగాణ చరిత్రకు గుర్తులన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరించి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు.

News May 31, 2024

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధించండి: కలెక్టర్

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. టైగర్ ఫారెస్ట్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా చేయాలని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి వాడి పడేసే కవర్ల వలన ఫారెస్ట్‌లో నివసించే జంతువులకు హాని జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

News May 31, 2024

వయోవృద్ధులను వేధిస్తే 3నెలల జైలు శిక్ష: ఆర్డీవో

image

వయోవృద్ధులైన తల్లిదండ్రులను వేధిస్తే 3నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజన్స్ పిలుపు, వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ పూర్తిగా పిల్లలదేనని స్పష్టం చేశారు.

News May 31, 2024

మేడారం: పేకాట ఆడుతున్న 14 మంది అరెస్ట్

image

మేడారంలోని విఐపి పార్కింగ్ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని సివిల్, సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. WGL, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఇబ్రహీం, షకీల్, జావిద్, రవిచందర్, సంజీవ, నర్సింగం, సతీష్ ఇజ్జగిరి, లక్ష్మీనారాయణ, సంపత్, వేణు, సంతోష్, ఫరీద్, నగేష్ లు మేడారం జాతరకు వచ్చి విఐపి పార్కింగ్ సమీపంలోని శివరాంసాగర్ చెరువు పక్కన పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. రూ.2లక్షల 500 నగదు, 2కార్లు,13ఫోన్లను సీజ్ చేశారు.