Telangana

News May 31, 2024

MBNR: ప్రతి 30 నిమిషాలకు ఓ రౌండ్ ఫలితం.. !

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా సైనిక దళాలలో పనిచేసే సైనిక ఓట్లు లెక్కించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 8:30 నిమిషాలకు కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి ప్రతి రౌండ్ ఫలితం వెలువడనుంది. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఫలితంపై ఉదయం 11 గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News May 31, 2024

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ షురూ

image

NLG జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలోని 435880 మంది ఆహార భద్రత కార్డుదారులకు జూన్ 2024 మాసానికి సంబంధించి 5949.848 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డిఎస్ఓ తెలిపారు.

News May 31, 2024

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య బహుమానం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తరపున కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు, స్వామివారికి ఇష్టమైన వడమాల అప్పాల మాలలను భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి గురువారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

News May 31, 2024

అందుబాటులో విత్తనాలు.. ఆందోళన వద్దు: కలెక్టర్

image

కౌడిపల్లి మండలం నాగ్ సాన్ పల్లి గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా విక్రయిస్తున్న పచ్చిరొట్ట విత్తనాల షాపును కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. రైతులకు సరిపడా జీలుగు, జానుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందవద్దని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 లక్షల 73 వేల 500 ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News May 31, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

image

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in
ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన అభ్యర్థులకు సూచించారు.

News May 31, 2024

ADB: ‘క్షయ నియంత్రణకు కృషి చేయాలి’

image

జిల్లాలో క్షయ నియంత్రణకు కృషి చేయాలని డబ్ల్యూహెచ్ఓ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ సూచించారు. అదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఆసుపత్రిలో టీబీ నియంత్రణకు ఉన్న సౌకర్యాలపై రిమ్స్ డెరైక్టర్ రాథోడ్ జైసింగ్, డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తో కలిసి ఆయన గురువారం సమీక్షించారు. ప్రస్తుతం రిమ్స్ ఆవరణలో మూసి ఉన్న టీబీ వార్డును పునరుద్ధరించడంతో పాటు అందులో పేషంట్ కేర్ ను, భద్రతా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

News May 30, 2024

FLASH: HYD: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

image

HYD రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఏఈలు నటాశ్, క్రాంతి తమకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని ఏసీబీ అధికారులు తెలిపారు.

News May 30, 2024

FLASH: HYD: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

image

HYD రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఏఈలు నటాశ్, క్రాంతి తమకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని ఏసీబీ అధికారులు తెలిపారు.

News May 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు.
@ శంకరపట్నం మండలంలో గుండెపోటుతో కండక్టర్ మృతి.
@వీర్నపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.
@ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య.
@ విత్తన దుకాణాలను తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్.
@ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
@చందుర్తి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ.

News May 30, 2024

రాష్ట్ర గీతంపై BRS అనవసర రాద్ధాంతం చేస్తుంది: విప్

image

‘జయ జయహే తెలంగాణ గీతం’పై BRS అనవసర రాద్ధాంతం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చిన KCR పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి కనీసం రాష్ట్రానికి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని మండిపడ్డారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే BRS నేతలకు నచ్చడం లేదని ఆరోపించారు.