Telangana

News May 30, 2024

నిర్మల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి శివారులో బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ యువకుడు రణధీర్ మృతి చెందారని పోలీసులు తెలిపారు. రణధీర్ తన బైక్ లో పెట్రోల్ పోయించుకుని రోడ్డును దాటే క్రమంలో బస్సు ఢీ కొనడంతో గాయపడ్డారు. దీంతో ఆయనను నిర్మల్ ఆసుపత్రికి తరలించగా రణధీర్ అక్కడ మృతి చెందినట్లు వారు వెల్లడించారు. రణధీర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖానాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

గజ్వేల్: అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన వడ్ల నరేశ్ చారీ ఆయన ఇంటి ముందు ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ సైదా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడుది హత్యగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

హైదరాబాద్‌ ఆస్పత్రులకు వస్తున్నారు..!

image

అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రులు HYDలో అధికంగా ఉండటంతో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు వరుస కడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా సహా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నగరంలో తక్కువకే వైద్య సేవలు అందుతుండటం కూడా కారణం. ఉస్మానియా, గాంధీ, MNJలో వైద్య సేవలు పొందుతున్నారు.

News May 30, 2024

హైదరాబాద్‌ ఆస్పత్రులకు వస్తున్నారు..!

image

అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రులు HYDలో అధికంగా ఉండటంతో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు వరుస కడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా సహా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నగరంలో తక్కువకే వైద్య సేవలు అందుతుండటం కూడా కారణం. ఉస్మానియా, గాంధీ, MNJలో వైద్య సేవలు పొందుతున్నారు.

News May 30, 2024

ఖమ్మం: విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపంలో కర్లపూడి నాగభూషణం(58) అనే విశ్రాంత ఎస్టీవో ఉద్యోగి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్వస్థలం ఖమ్మం బీకే బజార్. కొంతకాలంగా నాగభూషణం క్యాన్సర్ బాధపడుతున్నాడు. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో ఓ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కీమోథెరపి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 30, 2024

మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య

image

మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన జెవాజి సాయిలు( 80)ను అదే గ్రామానికి చెందిన జెవాజి శ్యామ్(32) మంత్రాల నెపంతో గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. శవాన్ని గడ్డివాములో దాచినట్లు పోలీసులకు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీశారు.

News May 30, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

image

నాగర్ కర్నూల్ సమీపంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో వచ్చే నెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, NGKL జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు కలెక్టర్లు సూచించారు.

News May 30, 2024

బడి బాటను విజయవంతం చేయాలి: వల్లూరి క్రాంతి

image

జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పాలనాధికారి వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సంబంధిత బడిబాట సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేయాల్సిన పనులను వివరించారు. జేసీ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సీఎంఓ వెంకటేశం అన్ని విభాగాల అధికారులు, ఎంఈఓ, హెచ్ఎంలు పాల్గొన్నారు.

News May 30, 2024

రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ షురూ

image

NLG జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలోని 435880 మంది ఆహార భద్రత కార్డుదారులకు జూన్ 2024 మాసానికి సంబంధించి 5949.848 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డిఎస్ఓ తెలిపారు.

News May 30, 2024

HYD: క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

image

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 1వ తేదీన HYD అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను జూబ్లీహిల్స్ MLA, BRS HYD చీఫ్ మాగంటి గోపీనాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.