Telangana

News May 30, 2024

MBNR: 3రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 28న ఎన్నిక జరగ్గా ఆటు ఆయా పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీఎం ఇలాక కావడంతో ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బరిలో మన్నే జీవన్ రెడ్డి(INC), నవీన్ కుమార్ రెడ్డి(BRS) హోరాహోరీగా తలపడ్డారు. జూన్ 2న MBNRలోని బాలుర జూ. కాలేజీలో ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.

News May 30, 2024

NLG: ‘మత్స్య సొసైటీకి ఎన్నికలను ఏర్పాటు చేయాలి’

image

నల్గొండ జిల్లాలోని మత్స్య సొసైటీకి ఎన్నికలను నిర్వహించాలని ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ అధికారికి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. రమణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నో యేండ్లుగా ఎన్నికలను నిర్వహించలేదని, వెంటనే నిర్వహించాలన్నారు.

News May 30, 2024

మహాముత్తారంలో జిల్లా కలెక్టర్ సమావేశం

image

అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మహాముత్తారంలోని రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News May 30, 2024

సంగారెడ్డి: నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

image

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వతరణ దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News May 30, 2024

HYD: 14 పేజీల లేఖ రాసి చనిపోయింది..!

image

HYD జీడిమెట్లలో పెళ్లికి ప్రేమికుడు ఒప్పుకోకపోవడంతో బుధవారం <<13340754>>అఖిల (22) అనే యువతి<<>> సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘షాపూర్‌నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమించాలని నా వెంటపడ్డాడు.. నేను లేకపోతే చచ్చిపోతా అని అనడంతో అతడిని నమ్మి మోసపోయాను.. తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదానిని’ అని.. ఇలా 14 పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకుందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 30, 2024

HYD: 14 పేజీల లేఖ రాసి చనిపోయింది..!

image

HYD జీడిమెట్లలో పెళ్లికి ప్రేమికుడు ఒప్పుకోకపోవడంతో బుధవారం <<13340754>>అఖిల (22) అనే యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ‘షాపూర్‌నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమించాలని నా వెంటపడ్డాడు.. నేను లేకపోతే చచ్చిపోతా అని అనడంతో అతడిని నమ్మి మోసపోయాను.. తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదానిని’ అని.. ఇలా 14 పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకుందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

News May 30, 2024

HYD: టీఎస్ఆర్టీసీ బస్సులో బ్యాగులు చోరీ 

image

షిరిడీ నుంచి HYD వస్తున్న TGSRTC బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. తుల్జాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పగలగొట్టి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో చోరీ జరిగింది.

News May 30, 2024

HYD: టీఎస్ఆర్టీసీ బస్సులో బ్యాగులు చోరీ

image

షిరిడీ నుంచి HYD వస్తున్న TGSRTC బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. తుల్జాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పగలగొట్టి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో చోరీ జరిగింది.

News May 30, 2024

బాన్సువాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ఇంట్లో విద్యుత్ ఎక్స్‌టెన్షన్ బాక్స్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన శ్రీనివాస చారి(45), నీరజ దంపతులు ఉపాధి కోసం సూరారంలోని విశ్వకర్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

బడుల పునః ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలి: కలెక్టర్

image

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు.