Telangana

News May 30, 2024

NGKL: బాత్రూంలో ప్రసవం.. పసికందు మృతి

image

ప్రసవం కోసం వచ్చిన గర్భిణి బాత్రూంలోనే బిడ్డకు జన్మనివ్వడంతో పసికందు మృత్యువాత పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వెలుగుచూసింది. స్థానికుల సమాచారం.. తాడూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(26) పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమె ఒంటరిగానే బాత్రూంకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రసవించడంతో శిశువు చనిపోయింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 30, 2024

మెదక్: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

శివంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత రాత్రి ఇంటి నుంచి వెళ్లిన నారాయణ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ADB: నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్: ఎస్పీ

image

ఆదిలాబాద్‌లో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీర్జా ముషారఫ్ బేగ్, షేక్ బిలాల్, అక్షయ్, దత్తును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద కారు, ఆటో, సెల్ ఫోన్, రూ.4వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

News May 30, 2024

కరీంనగర్: బడి బస్సు భద్రమేనా?

image

వచ్చే నెల జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా షెడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,389 ప్రైవేటు పాఠశాలలు బస్సులు ఉన్నాయి. వీటి ఫిట్‌నెస్ గడువు ఈ నెల 15తో ముగిసింది. ఈ వార్షిక సంవత్సరం బస్సులు రోడ్డెక్కాలంటే ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. 

News May 30, 2024

KMM: ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 1962, 102 వాహనాల పైలట్ (డ్రైవర్) ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 31న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

News May 30, 2024

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

ఇల్లందు: వడదెబ్బతో కూలీ మృతి

image

అడ్డా మీద కూలీ పనికి వెళ్తున్న ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన రజబెల్లి (55) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు ఇష్టూ జిల్లా అధ్యక్షుడు యాకుబ్ షావలి బుధవారం తెలిపారు. 30 ఏళ్లుగా బొగ్గు కాటా వద్ద పనిచేస్తున్న రజబెల్లి ఏడాదిగా బొగ్గు లేకపోవటం వల్ల కుటుంబాన్ని పోషించుకునేందుకు అడ్డా మీద కూలీకి వెళ్తున్నాడని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News May 30, 2024

MDK: చట్నీలో బల్లి.. పలువురికి అస్వస్థత

image

చట్నీలో బల్లి పడగా.. అది తిన్న పలువురు అస్వస్థతకు గురైన ఘటన శివ్వంపేట మండలం నవాపేట్‌‌ గ్రామంలోని ఫ్లెమింగ్ కంపెనీలో జరిగింది. మంగళవారం కంపెనీ క్యాంటీన్ సిబ్బంది నిర్లక్ష్యంతో చట్నీలో బల్లి పడినప్పటికి గమనించని వర్కర్లు టిఫిన్ చేసి పనిలో నిమగ్నమవ్వగా.. 20మంది అస్వస్తతకు గురైయ్యారు. వారిని HYDలోని ఓ ఆస్పత్రికి తరలించారు. క్యాంటీన్ మెయింటనెన్స్ నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని వర్కర్లు ఆరోపించారు.

News May 30, 2024

మహబూబ్‌నగర్: ‘ఇంకో 5 రోజులే.!’

image

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరో 6 రోజుల్లో వెలువడనుంది. లెక్కింపు జూన్ 4 సమీపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎలాంటి తీర్పు వెలువడనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల అధినేతలతో పాటు ప్రధాన నేతల గెలుపోటములపై ఒక్కొక్కరు రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారట. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ‘కాయ్ రాజా కాయ్’ జోరుగా సాగుతోందట.

News May 30, 2024

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్ధులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.