Telangana

News May 30, 2024

MBNR: గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులు.. ఇది మీకోసమే.!

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు చేసింది. జూన్ 9న ఉ. 10.30 నుంచి మ.1 వరకు పరీక్ష జరుగుతుందని, 10 గంటలకల్లా గేట్లు మూసేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని, షూస్ వేసుకోవద్దని, పరీక్ష పూర్తయ్యే వరకు బయటికి వెళ్లేందుకు కుదరదని పేర్కొంది. మెహెందీ, టాటూలు వేసుకోవద్దని.. విలువైన వస్తువుల్ని వెంట తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది.

News May 30, 2024

సిద్దిపేట: మద్దూరు మండలంలో గుప్త నిధులు లభ్యం

image

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గుప్త నిధులు లభించాయి. నర్సాయపల్లి గ్రామంలో కూలీలు ఈరోజు ఉదయం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారు. చల్ల మల్లారెడ్డి రైతు భూమిలో ఉపాధి పనుల్లో భాగంగా.. వరం చెక్కుతుండగా గుప్త నిధి బయటపడింది. అందులో కొన్ని ఉర్దూలో ఉన్న వెండి నాణాలు బయట పడ్డాయి. వాటిపై అధికారులు విచారణ చేపట్టారు.

News May 30, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.16,500 పలకగా.. ఏసీ తేజ మిర్చి రూ.19,500 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చికి రూ.25 వేల ధర వచ్చింది.

News May 30, 2024

సిరిసిల్ల: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనరావుపేట మండల కేంద్రానికి చెందిన కోలకాని నవీన్ (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 30, 2024

MBNR: మళ్లీ చిరుత కలకలం.. రైతుల్లో భయం.. భయం

image

కుక్కను తరుముతూ మరోమారు చిరుత ప్రత్యక్షమైంది. అదిచూసి భయంతో రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. కొండాపూర్‌లో ఆంజనేయులు రాత్రి పశువులకు మేత వేయడానికి వెళ్లగా తన కుక్క అరవడంతో లైట్ వేశాడు. కొద్ది దూరంలో చిరుత నిలబడి కనిపించింది. దీంతో ఆయన భయంతో పక్కనే ఉన్న కృష్ణయ్య, రాములు వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వారికి చెప్పడంతో వాళ్లు వచ్చే సరికి చిరుత కనిపించలేదు. అక్కడ ఉండకుండా ఇళ్లకు చేరుకున్నారు.

News May 30, 2024

పెద్దవూర: సాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకుగాను 504.70 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలకుగాను ప్రస్తుతం 122.8483 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News May 30, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,210

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ప్రత్యేక సెలవు ఉండగా.. ఈరోజు పునః ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. మంగళవారంతో పోలిస్తే ధర తగ్గింది. మొన్న క్వింటా పత్తి ధర రూ.7,275 పలకగా.. నేడు రూ.7,210కి చేరింది. పత్తి ధరలు దారుణంగా పడిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News May 30, 2024

NLG: సీఎంఆర్ ఆఖరి గడువు జూన్ 15?

image

ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం తీసుకొని బియ్యం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై పీడీ యాక్టు లాంటి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వానాకాలం 2023-24 సీఎంఆర్ తో పాటు బకాయిపడిన బియ్యాన్ని జూన్ 15 వరకు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనాధికారి హెచ్చరించినట్లు తెలుస్తుంది. బకాయి బియ్యం ఇవ్వకుంటే మిల్లర్లపై పిడి యాక్ట్ పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

News May 30, 2024

రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్ గౌతమ్

image

జిల్లాలో ఈ వర్షాకాలంలో 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశామని, ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 4,49,347 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, బుధవారం నాటికి 34 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించామని వివరించారు. అందరికీ సరిపడా విత్తనాలు సమకూరుస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.

News May 30, 2024

MBNR: మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు

image

MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించారు. మొత్తం 1,439 మంది ఓటర్లకు గానూ ఈ ఉప ఎన్నికలో 1,437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటు వేయలేదు. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును జూన్ 2న చేపట్టి, అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.