Telangana

News May 30, 2024

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు: భద్రాద్రి డీఈవో

image

జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో పంపిస్తామని తెలిపారు.

News May 30, 2024

కరీంనగర్: పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే తుది గడువు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్, తృతీయ సంవత్సరం ఆరో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందని ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి డా. ఆడెపు శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు శుక్రవారంలోగా చెల్లించాలని తెలిపారు.

News May 30, 2024

ఖమ్మం: ‘వివాహేతర సంబంధం వల్లే తల్లీబిడ్డలను చంపాడు’

image

రఘునాథపాలెం మండలం బాబోజితండాకు చెందిన ప్రవీణ్, భార్య కుమారి(25), పిల్లలు కృషిక (5), తనిష్క(3) కారులో వెళ్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టిన విషయం విదితమే. ప్రవీణ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ కూతురు, మనవరాళ్లను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే నిజనిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.  

News May 30, 2024

ఆర్మూర్: రూ.కొటిన్నరతో దంపతులు పరార్

image

రూ.కొటిన్నరతో దంపతులు పరారైన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో నివాసం ఉండే ప్రవీణ్ దంపతులు జాతీయ రహదారి పక్కన కిరాణా షాప్, బట్టల వ్యాపారం నిర్వహించేవారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో పలువురి వద్ద సుమారు రూ.కోటిన్నర వరకు అప్పు చేశారు. అప్పులు చెల్లించలేక నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయినట్లు బాధితులు తెలిపారు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు.

News May 30, 2024

మిర్యాలగూడలో రైలు కింద పడి ఇద్దరు సూసైడ్

image

మిర్యాలగూడ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మృతులు మిర్యాలగూడ మం. వెంకటాద్రిపాలెం దురనగర్ వాసులుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 30, 2024

నేటి నుంచి హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

image

కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షరకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News May 30, 2024

ఖమ్మం: కడసారి చూపునకు రాని భర్త ప్రవీణ్

image

రఘునాథపాలెం మండలంలో మంగళవారం కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో కుమారితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలో భర్త ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వారి మృతదేహాలకు శవ పరీక్షల అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో మృతదేహాలను బావోజీ తండాకు తరలించారు. బంధువుల కన్నీరు నడుమ ముగ్గురికి ప్రవీణ్ తండ్రి మత్రు అంత్యక్రియలు నిర్వహించారు.

News May 30, 2024

మంచిర్యాల జిల్లాలో వడ దెబ్బతో ముగ్గురి మృతి

image

బుధవారం మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. మంచిర్యాల జిల్లాలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నెన్నెల మండలానికి చెందిన తోట తిరుపతి(36), హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామానికి చెందిన ఐలయ్య(36), తాండూర్ మండలంలోని అబ్బపూర్ గ్రామానికి చెందిన టేకం భీంరావ్(26) వడదెబ్బతో మృతి చెందారు. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

News May 30, 2024

చిన్న నిజాంపేటలో వ్యక్తి ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని చిన్న నిజాంపేట గ్రామంలో కోనాపురం రాజు(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, కొడుకు(6) ఉన్నారు. వివరాల్లోకి వెళితే కుటుంబ కలహాలతో వారి పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు. దీనిపై భూంపల్లి పోలీసులు పంచనామ నిర్వహించి, కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

News May 30, 2024

గ్రేటర్‌లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

గ్రేటర్‌లో మొన్నటి వరకు వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు, మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూటజనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 27.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు గాలిలో తేమ 32 % నమోదైనట్లు వెల్లడించారు.